ఏయూకు నిధుల మంజూరు శుభపరిణామం
ఏయూకు నిధుల మంజూరు శుభపరిణామం

విశాఖపట్నం, న్యూస్‌టుడే : ఏయూకు నిధుల మంజూరు శుభపరిణామం
రూసా పథకాన్ని డిజిటల్ లాంఛ్ ద్వారా ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం సాయంత్రం
శ్రీనగర్‌లో ప్రారంభించారు.
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఈ పథకం అమలు కోసం దేశవ్యాప్తంగా పది విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసింది.
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈ పథకంలో ఎంపిక కావడంతో ప్రధాని ప్రారంభించిన డిజిటల్ లాంచింగ్‌ను ప్రత్యక్ష ప్రసారం
ద్వారా ఆచార్యులు, విద్యార్థులు తిలకించారు.
ఏయూ కన్వెన్షన్ కేంద్రంలో భారీ తెరను ఏర్పాటు చేసి ప్రసారం చేశారు.
ఈ సందర్భంగా రూసా-2 పథకం ప్రారంభంలో భాగంగా ఏయూలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని విశాఖ ఎంపీ డాక్టర్
హరిబాబు, వీసీ ఆచార్య నాగేశ్వరరావులు ఆదివారం ఆవిష్కరించారు.
రూసాలో ఏయూకు రూ.100 కోట్లు విడుదల అవుతాయని వీసీ ఆచార్య నాగేశ్వరరావు తెలిపారు.
ఈ నిధులలో రూ.22 కోట్లు విద్యార్థుల సౌకర్యాల కల్పనకు వెచ్చిస్తామన్నారు.
విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్ది అత్యుత్తమంగా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని వీసీ ఏయూకు రూ.100 కోట్ల
నిధుల మంజూరు కావడం శుభ పరిణామమని ఎంపీ డాక్టర్ కె.హరిబాబు పేర్కొన్నారు.
పెద్దఎత్తున పాల్గొన్న విద్యార్థులు రూసా 2 ప్రారంభ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.
రెక్టార్ ఆచార్య ఎం.ప్రసాదరావు, రిజిస్ట్రారు ఆచార్య కె.నిరంజన్, రూసా సమన్వయకర్త ఆచార్య కె.వి.రమణ,
పలువురు ప్రిన్సిపల్స్, డీన్లు, విద్యార్థులు, ఆచార్యులు పాల్గొన్నారు.