News

Realestate News

ఎస్టీబీఎల్‌ వద్ద సీఎం రాకకు ఏర్పాట్లు

vizag news

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే: షీలానగర్‌ ఎస్టీబీఎల్‌ ప్రాంగణంలోని ఎస్టీబీఎల్‌ సినీ వరల్డ్‌ను శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని సంస్థ యజమాని జి.బాలాజీ తెలిపారు. భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా నిర్మాణమయిన ఈ మూడు థియేటర్లను సీఎం శనివారం ఉదయం తొమ్మిదిన్నరకు ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొంటారని చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో శుక్రవారం సీఎం భద్రతా సిబ్భంది ఎస్టీబీఎల్‌ ప్రాంగణంలో క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించారు.
మంత్రి గంటాకు ఆహ్వానం..

రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును శుక్రవారం విశాఖ విమానాశ్రయంలో ఎస్టీబీఎల్‌ ఛైర్మన్‌ జి.బాలాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో వెళ్లి కలిశారు. శనివారం ఎస్టీబీఎల్‌ సీనివరల్డ్‌ప్రారంభం జరుగుతుందని పాల్గొనాలని మంత్రిని బాలాజీ ఆహ్వానించారు. థియేటర్‌ వివరాలను ట్యాబ్‌ ద్వారా గంటాకు తెలియజేశారు. అనంతరం ఎంపీ హరిబాబు, పలువురి ఎమ్మెల్యేలను కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని కోరినట్లు బాలాజీ తెలిపారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo