ఎల్పీసెట్ 2016కు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ

విజయనగరంఅర్బన్, న్యూస్టుడే: 2016-17 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ ఐఏఎస్ఈఎస్/సీటీఈఎస్, ప్రైవేటు భాషాపండితుల శిక్షణ కళాశాలల్లో ఏడాది భాషా పండిత కోర్సులో ప్రవేశ పరీక్షకు (ఎల్పీసెట్-2016) ఆన్లైన్ దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లావిద్యాశాఖాధికారిణి అరుణకుమారి ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు జులై ఒకటో తేదీ నుంచి 12తేదీ వరకు http://lpcet.cgg.go“.inవెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేయాలని పేర్కొన్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష జరుగుతుందన్నారు. దరఖాస్తు దాఖలు, అర్హత ప్రమాణాలు, మార్గదర్శకాలకు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. మాన్యువల్ దరఖాస్తులు స్వీకరించబడవన్నారు.