ఎంవీపీలో వెస్ట్రన్ క్లినిక్ ప్రారంభం

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే:
ఎంవీపీకాలనీలో ఆళ్వార్‌దాస్ కూడలిలో నూతనంగా ఏర్పాటు చేసిన వెస్ట్రన్ క్లినిక్‌ను రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఆదివారం ఉదయం ప్రారంభించిన వెస్ట్రన్ క్లినిక్ ద్వారా ఆర్థోపెడిక్స్‌లో డాక్టర్ రాఘవేంద్రన్, జనరల్ మెడిసిన్ విభాగంలో డాక్టర్ సునీల్, పీడియాట్రిక్స్ విభాగంలో డాక్టర్ గణేష్, పెయిన్ మేనేజ్మెంట్ విభాగంలో డాక్టర్ ప్రవీణ్‌లు తమ సేవలు అందించనున్నారు. ఈ క్లినిక్ ద్వారా సేవలందించే వైద్యులందరికి 10 నుంచి 15 సంవత్సరాల అనుభవం ఉందని, జర్మనీ, యూకె, అమెరికాలో పనిచేసి, విశాఖకు వచ్చిన వారేనన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ స్మార్ట్‌సిటీగా అభివృద్ది చెందుతున్న విశాఖలో ప్రభుత్వ, కార్పొరేట్ ఆసుపత్రులే కాకుండా ఈ తరహా క్లినిక్స్ కూడా అవసరమని పేర్కొన్నారు. వైద్యులు రాఘవేంద్రన్, సునీల్, గణేష్, ప్రవీణ్‌లు మాట్లాడుతూ వైద్యులుగా పాశ్చాత్య దేశాల్లో తాము పొందిన శిక్షణను నగరవాసులకు అందించాలన్న ఉద్దేశంతో ఈ క్లినిక్‌ను తెరిచామన్నారు. అర్హులైన పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి నగరానికి చెందిన పలువురు వైద్యులు హాజరయ్యారు.