News

Realestate News

ఉన్నత శిఖరమే లక్ష్యంగా కృషి చేయండి


ఉన్నత శిఖరమే లక్ష్యంగా కృషి చేయండి

విద్యార్థినులతో ఎస్పీ అట్టాడ బాబూజీ

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే:ఉన్నత శిఖరమే లక్ష్యంగా కృషి చేయండి

మన్యం ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్న లక్ష్యంగా

కష్టపడి చదవాలని ఎస్పీ అట్టాడ బాబూజీ సూచించారు.

చింతపల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులతో కలిసి మంగళవారం నూతన సంవత్సర వేడుకలను

నిర్వహించారు. వారితో కలిసి కేకు కోశారు.

గిరిజనుల్లో ఎంతో మంది ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నప్పటికీ ఉన్నత విద్యకు దూరంగా ఉండిపోతున్నారని

ఆవేదన వ్యక్తం చేశారు.

తాను చదువుకునే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు, పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు ఉండే వారు

కాదన్నారు.

అయినా.. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు చదువుపై ప్రత్యేక దృష్టిసారించినట్లు గుర్తు చేసుకున్నారు.

ప్రస్తుతం గిరిజన విద్యార్థులకూ ప్రభుత్వం సౌకర్యాలను కల్పిస్తోందని,

ఉన్నత చదువులకు అవకాశాలు మెరుగుపడ్డాయని చెప్పారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని ఒక్కో మెట్టు పైకి ఎక్కాలని

సూచించారు.

కష్టపడి చదవడం కన్నా ఎంచుకున్న రంగాల్లో రాణించేందుకు ఇష్టపడి చదివితే సులభంగా లక్ష్యాలను

చేరుకోవచ్చన్నారు.

పోలీసు శాఖ తరఫున గిరిజన ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, గిరిజన గ్రామాలకు రహదారులు,

తాగునీరు, బస్‌షెల్టర్లు, యువతకు ఉపాధి అవకాశాలు చూపుతున్నామని పేర్కొన్నారు.

ఏఎస్పీ సతీష్‌కుమార్‌, డీఎస్పీ అనిల్‌, ఏఆర్‌ ఏఎస్పీ శాంతికుమార్‌, రాళ్లగెడ్డ సీఆర్‌పీఎఫ్‌ డీఎస్పీ పాపారావు,

ఎస్‌బీఎక్స్‌ సీఐ వెంకటరావు, సీఐ చంద్రశేఖరరావు, అన్నవరం, చింతపల్లి, రాళ్లగెడ్డ ఎస్సైలు రమేష్‌, సురేష్‌,

లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.