ఉన్నత లక్ష్యంతో ముందడుగేయండి: ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ

జిల్లాపరిషత్తు, న్యూస్‌టుడే: విద్యార్థి దశ నుంచే ఉన్నత స్థానాలకు ఎదగాలని లక్ష్యంగా పెట్టుకోవాలని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ పేర్కొన్నారు. గురువారం తన కార్యాలయంలో పోలీసు కుటుంబాలకు చెందిన విద్యార్థుల్లో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన తొమ్మిది మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ కీలకమన్నారు. ఇంజినీరింగ్, డిగ్రీ, మెడిసిన్, ఇలా ఏ వృత్తిని ఎంచుకోవాలన్నా ఈ దశ కీలకమన్నారు. ఇప్పుడే కచ్చితమైన నిర్ణయాలతో ముందడుగేయాలని సూచించారు. భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్నది ఇప్పటి నుంచి కలలు కనాలని, వాటిని సాకారం చేసుకునేందుకు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎన్.శ్రావణి, బి.సాయిదీపక్, జి.సాయితరుణ్, జి.గౌతమ్, కె.వెంకటరమణ, ఎ.వరుణ్‌కుమార్, డి.సాయి సందీప్, బి. అనూష, వై.మణిదీప్(ఇంటర్) విద్యార్థులకు రూ.వెయ్యి నుంచి రూ. 4000 వరకు నగదు బహుమతి అందించారు.