ఉద్యోగ భద్రత కల్పించాలని ఆందోళన
ఉద్యోగ భద్రత కల్పించాలని ఆందోళన

ఉద్యోగ భద్రత కల్పించాలని ఆందోళన
అన్ఎయిడెడ్ కళాశాలల్లో పార్ట్‌టైమ్ అధ్యాపకులు,
అధ్యాపకేతర సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ అన్ఎయిడెడ్ అధ్యాపక,
అధ్యాపకేతర సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.
అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) వీరి ఆందోళనకు మద్దతు ప్రకటించింది.
తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న అధ్యాపకులు,
అధ్యాపకేతర సిబ్బందిని క్రమబద్ధీకరించాలని ఏవీఎన్ కళాశాలలో పనిచేస్తున్న సిబ్బంది,
అధ్యాపకులు విధులను బహిష్కరించారు. అక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్‌కు వచ్చారు.
జీఓ 35ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఎయిడ్ విద్యా సంస్థలను రక్షించాలని కోరారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డి.ప్రకాష్, వైస్ ప్రిన్సిపల్ మధుసూదన్, సంఘం ఛైర్మన్ ఎస్.పుల్లారావు,
ఏరియా కార్యదర్శి వీవీజే గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.