News

Realestate News

ఉత్సవాలకు భారీ బందోబస్తు

ఉత్సవాలకు భారీ బందోబస్తు
పాడేరు ఏఎస్పీ శశికుమార్‌
పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాల ఏర్పాట్లలో భాగంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని పాడేరు ఏఎస్పీ కె.శశికుమార్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక ఆయన కార్యాలయంలో విలేరులతో మాట్లాడారు. ఉత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలా భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉత్సవాలకు వారం రోజుల ముందుగానే తాము సన్నద్ధం అయ్యామని తెలిపారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విశాఖపట్నం, అరకు మార్గాల నుంచి బస్సులు అవాంతరం లేకుండా వచ్చివెళ్లేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రధాన కూడళ్లలో వాహనాల తనిఖీలు ఉంటాయని… ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు తమ వెంట గుర్తింపు కార్డులు ఉంచుకోవాలని ఏఎస్పీ సూచించారు. అమ్మవారి ఆలయం, సతకంపట్టు వద్ద పోలీస్‌ కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయనున్నామన్నారు. ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీఆర్‌పీఎఫ్‌, స్పెషల్‌ పార్టీ బలగాలకు తోడు పలువురు ఎస్సైలు, సీఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లతో భారీ బందోబస్తు ఉంటుందని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా పోలీస్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్లు 9440904232, 9491622005, 9440604230లకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చునని సూచించారు. ఉత్సవాల మూడు రోజుల్లో మద్యం అక్రమ అమ్మకాలు చేస్తే బైండోవర్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. పట్టణంలో ఉన్న అనుమతి ఉన్న దుకాణాల్లో కూడా రాత్రి 10 గంటల వరకే అమ్మకాలు జరగాలని సూచించారు. ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా ప్రజలంంతా సహకరించాలని ఆయన కోరారు.