News

Realestate News

ఈ-పాలన సదస్సు ఏర్పాట్లు భేష్‌

ఈ-పాలన సదస్సు ఏర్పాట్లు భేష్‌
కలెక్టర్‌, డీసీపీలకు అవార్డులు

విశాఖపట్నం, ఈనాడు(The e-governance seminar arrangements bhes): నగరంలో ఈ-పాలనపై నిర్వహించిన జాతీయ సదస్సుకు జిల్లా యంత్రాంగం అద్భుత ఏర్పాట్లు చేసిందని పలువురు ఆహూతులు ప్రశంసల వర్షం కురిపించారు. సదస్సుకు వచ్చిన ఉన్నతాధికారులు, ఐ.టి.నిపుణులు, వివిధ సంస్థల ప్రతినిధులు నగర సౌందర్యాన్ని చూసి మంత్రముగ్థులయ్యారని ప్రశంసించారు. నగరాన్ని ఆ స్థాయిలో నిర్వహిస్తున్న నగర కమిషనర్‌, కలెక్టర్లను తప్పనిసరిగా అభినందించాల్సిందేనని కేంద్ర సహాయ మంత్రి జితేంద్రసింగ్‌ సోమవారం ప్రకటించారు. మంగళవారం కార్యక్రమానికి హాజరైన వారు కూడా జిల్లా అధికారులను ప్రశంసల్లో ముంచెత్తారు. ముగింపు కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ను ప్రత్యేకంగా వేదికపైకి పిలిచి సన్మానించారు. పోలీసుశాఖ తరపున డీసీపీ నవీన్‌గులాటీని సత్కరించారు.

ఈ-పాలన జాతీయ సదస్సుకు హాజరైన ఆహూతులకు నగరాన్ని చూపించడానికి పర్యాటకశాఖ మంగళవారం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కురుసురా జలాంతర్గామి మ్యూజియం, కైలాసగిరి, తెలుగుమ్యూజియం, రుషికొండ, సెంట్రల్‌పార్క్‌ తదితర ప్రాంతాలను చూపించారు.