News

Realestate News

ఈపీడీసీఎల్‌లో ‘కమాండ్‌ కంట్రోల్‌ రూం’ ఏర్పాటు

vizag real estate news

ఈపీడీసీఎల్‌లో ‘కమాండ్‌ కంట్రోల్‌ రూం’ ఏర్పాటు
గురుద్వారా, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌) పరిధిలో గల విద్యుత్‌ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల్ని సత్వరమే పరిష్కరించేందుకు సీఎండీ ఎంఎం నాయక్‌ సోమవారం కాల్‌ సెంటర్‌లో ‘కమాండ్‌ కంట్రోల్‌ రూం’ ఏర్పాటు చేశారు. కంట్రోల్‌ రూంకి విద్యుత్‌ సంబంధిత ఫిర్యాదుల్ని 1912 నెంబరు ద్వారా తెలియజేయవచ్చు. కింది స్థాయి సెక్షన్‌ కార్యాలయాల్లో పరిష్కారం కాని విద్యుత్‌ ఫిర్యాదుల్ని ఈ నెంబర్‌కి తెలియజేస్తే కమాండ్‌ కంట్రోల్‌ రూం సహాయంతో సత్వరమే పరిష్కరించేందుకు వీలుంటుంది. దీనికోసమే బలోపేతమైన వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సీఎండీ తెలిపారు. కంట్రోల్‌ రూంకి వినియోగదారులు ఏ సమయంలోనైనా ఫోన్‌ చేయవచ్చన్నారు. సమస్యను తెలియజేసేందుకు సిబ్బంది 24 గంటలు మీకు అందుబాటులో ఉంటారన్నారు. వారం రోజుల పాటు వచ్చిన ఫిర్యాదుల్ని ఆయన సమీక్షించారు. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల్ని సకాలంలో ఉన్నతాధికారులు సమీక్షించి కిందిస్థాయి సిబ్బందికి తగిన ఆదేశాలు ఇవ్వటం వలన గరిష్ట స్థాయిలో పరిష్కరించగలమని సిబ్బందికి సూచించారు. ఇందులో డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.