News

Realestate News

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెరైన్‌ ఇంజినీర్స్‌ క్యాంపస్‌కు ప్రతిపాదన

03-06-2016-001 news vizag realestate

  మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ఏయూలో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెరైన్‌ ఇంజినీర్స్‌ కార్యాలయం ఏర్పాటు చేస్తామని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెరైన్‌ ఇంజినీరింగ్‌ ప్రతినిధులు ప్రతిపాదించారు. గురువారం ఏయూ ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య ఇ.ఎ.నారాయణను కలిసి వీటికి సంబంధించిన ప్రతిపాదనలు అందజేశారు. ప్రస్తుతం వర్సిటీలో మెరైన్‌ ఇంజినీరింగ్‌ విభాగం పైఅంతస్తులో సుమారు రెండుకోట్ల వ్యయంతో నూతన భవనాన్ని నిర్మిస్తామన్నారు. దీనిని ఐఎంఈ పరీక్షల నిర్వహణ, సదస్సుల ఏర్పాటు, ఏయూ మెరైన్‌ ఇంజినీరింగ్‌ విభాగం వినియోగానికి ఏర్పాటు చేస్తామన్నారు. మెరైన్‌ ఇంజినీరింగ్‌ నిపుణులకు, మెరైన్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి అనుసంధానంగా ఐఎంఈ నూతన శాఖ పనిచేస్తుందన్నారు.అనంతరం ఇన్‌ఛార్జి వీసీ ఇ.ఎ.నారాయణను ఐఎంఈ ప్రతినిధులు సత్క రించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు, ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్య సి.హెచ్‌.వి.రామచంద్రమూర్తి, ది ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ విశాఖ ప్రాంతీయశాఖ ఛైర్మన్‌ అమిత్‌ భట్నాగర్‌, వి.లక్ష్మిపతిరావు, హెచ్‌.ఎస్‌.ఆనంద్‌, ఎ.విజయనంద్‌కుమార్‌, డీఎస్‌ఆనంద్‌, తదితరులు పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo