ఇక రెవెన్యూ సేవలన్నీ ఆన్లైన్లోనే..!
రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి అమలు
కార్పొరేషన్, న్యూస్‌టుడే:

అసెస్మెంట్లు సైతం…
ప్రస్తుతమున్న అసెస్మెంట్లన్నీ ఆన్‌లైన్‌లోకి మళ్లించామని రవీంద్ర తెలిపారు.
జీవీఎంసీ పరిధిలో 4,44,423 అసెస్మెంట్లు ఉన్నాయి. వీటిలో జోన్-1 పరిధిలో 62,534, జోన్-2లో 71,792, జోన్-3లో 46,510, జోన్-4లో 85,846, జోన్-5లో 88,860, జోన్-6లో 56,165, అనకాపల్లిలో 19,487, భీమిలిలో 13,229 ఉన్నాయి.
ఏటా రూ. 210 కోట్ల ఆస్తిపన్ను వసూలవుతోంది.
ప్రత్యేక కేంద్రాలు…
ఆస్తి పన్ను సేవలకు సంబంధించి ప్రతి జోన్‌లోనూ ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, సాఫ్ట్‌వేర్‌పై అనుభవం కలిగిన సిబ్బంది ఒక్కొక్కరిని జోన్‌లోని కేంద్రంలో నియమిస్తామన్నారు. ఇప్పటికే రెవెన్యూ సిబ్బందికి ఆన్లైన్ ప్రక్రియపై శిక్షణ తీసుకున్నారన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తరువాత ఎవరి వెనుకా తిరగాల్సిన అవసరం లేదని, 15 రోజులలో సేవ అందుతుందన్నారు. దరఖాస్తుదారుడు ఏ సేవ కోసమైతే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారో వాటి పరిశీలనార్థం క్షేత్రస్థాయిలో సిబ్బంది పరిశీలన ఉంటుందన్నారు. ట్యాక్స్కలెక్టర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, రెవెన్యూ ఆఫీసర్, జోనల్ కమిషనర్, డీసీఆర్ ఇలా ఒక పద్దతి ప్రకారం దస్త్రాలు ఆన్లైన్లో వెళతాయని పేర్కొన్నారు.
ఆన్లైన్ సేవల ద్వారా చెల్లించిన నిధులు ఎప్పటికప్పుడు జీవీఎంసీకి బదిలీ అయ్యేలా కూడా ఏర్పాటు చేశారు. దీని వల్ల క్షేత్రస్థాయి సిబ్బంది చేతివాటం కొంత వరకు తగ్గే అవకాశం ఉంది.