News

Realestate News

ఇక మనతోనే..

ఇక మనతోనే..

టీయూ-142 యుద్ధవిమానం కొలుదీరనుందిలా..
జనవరి- 2018 నాటికి ప్రదర్శన శాల అందుబాటులోకి..
పనులకు గడువు నిర్దేశించిన వుడా

* ప్రదర్శన శాల: టీయూ-142ఎం యుద్ధవిమాన ప్రదర్శనశాల
* ఎక్కడ..?: విశాఖలోని రామకృష్ణ బీచ్‌లో కురుసుర జలంతర్గామికి ఎదురుగా..
* నిర్వహణ విభాగం: విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా)
* నిర్మాణ వ్యయం: రూ. 10 కోట్లు
* ప్రాజెక్టు పూర్తికి గడువు: 9 నెలలు (08.04.2017 నుంచి 31.12.2017 వరకు)

సాగరతీరంలో సమరనాథం మోగనుంది.. విహంగంలో విజయనాథాన్ని సగర్వంగా చాటనుంది.. 29 ఏళ్లపాటు రక్షణ విభాగంలో పనిచేసిన టీయూ-142ఎం యుద్ధవిమానం విశాఖలోని రామకృష్ణ బీచ్‌లో కొలువు దీరనుంది. సుదీర్ఘ సేవలందించి నిష్క్రమించిన ఈ యుద్ధవిమాన స్వీకరణ కార్యక్రమం విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో శనివారం అట్టాహాసంగా జరిగింది. ఇక మిగిలిందల్లా ప్రదర్శనశాల ఏర్పాటే.. దీనిపై విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) అధికారులు దృష్టిసారించారు. విశాఖ చేరుకున్న యుద్ధవిమానాన్ని విడగొట్టి.. నిర్దేశిత ప్రాంతానికి చేర్చి ప్రదర్శన శాల వద్ద పునర్నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి అనుసంధానంగా మౌలిక వసతుల కల్పనకూ వ్యూహాలను సిద్ధం చేశారు. సాగర తీరంలో పర్యాటకులను, ఇతర సందర్శకులను ఆకట్టుకునేలా యుద్ధ విమాన ప్రదర్శనశాల ఏర్పాటు ప్రక్రియ వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి చేయాలని వుడా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

ఒక్కో పనికి ఒక్కో గడువు..
విశాఖలోని ఆర్కే బీచ్‌లో యుద్ధవిమాన ప్రదర్శనశాల ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికను వుడా వీసీ డాక్టర్‌ బాబూరావునాయుడు ఇప్పటికే సిద్ధం చేశారు. శనివారం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ప్రణాళికను వివరించారు. పనులను ఈ ఏడాది డిసెంబరు మాసాంతానికి పూర్తి చేసి 2018 జనవరి 1 నుంచి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
* విశాఖ చేరుకున్న టీయూ-142ఎం యుద్ధవిమానాన్ని విడగొట్టి ప్రదర్శనశాల ఏర్పాటు ప్రదేశానికి తరలించి అక్కడ మళ్లీ అమర్చే బాధ్యతను తమిళనాడులోని హాసర్‌లోని తనేజా ఏరోస్పేస్‌ అండ్‌ ఏవియేషన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీకి అప్పగించారు. రూ. 3.91 కోట్లకు ఈ టెండరు ఖరారైంది. పనులను ఏప్రిల్‌ 15 నుంచి సెప్టెంబరు 14లోగా పూర్తి చేయాలి.

* ప్రదర్శనశాల ఏర్పాటుకు స్థల ఎంపిక.. యుద్ధవిమానం నిలిపేందుకు అవసరమైన ప్రాంగణం ఏర్పాటు తదితర ప్రక్రియ మే 1 నుంచి ఆగస్టు 31లోగా పూర్తి చేయాలి.

* యుద్ధ విమానాన్ని ప్రదర్శనశాలగా మార్చాక అక్కడ ఎయిర్‌ కండిషన్‌ వసతులతో కూడిన సదుపాయాల కల్పన ఆగస్టు 1 నుంచి అక్టోబరు 31లోగా పూర్తవ్వాలి.

* ప్రదర్శనశాల ప్రాంగణంలో టికెట్‌ కౌంటర్‌, నిరీక్షణ గది, క్యాంటిన్‌, ఇతరత్రా సదుపాయాలకు జూన్‌ 1 నుంచి డిసెంబరు 31 వరకు గడువు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ద్వారా పనులు గడువులోగా పూర్తవ్వాలి.

* యుద్ధ విమాన ప్రదర్శన నిర్వహణ బాధ్యతలు టెండర్ల ప్రక్రియ ద్వారా 2018 జనవరి నుంచి అప్పగించే ఏర్పాట్లూ చేస్తున్నారు.


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo