News

Realestate News

ఇంతకీ ఉన్నట్టా.. లేనట్టా?

ఇంతకీ ఉన్నట్టా.. లేనట్టా?
చెరకు ప్రోత్సాహక ధరపై అయోమయం
అనకాపల్లి, న్యూస్‌టుడే: గత 15 ఏళ్లుగా చెరకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహక ధర ఈ సీజన్‌లో ఇస్తారో లేదో తెలియక రైతులు సతమతమవుతున్నారు. చక్కెర కర్మాగారాలు ప్రతి టన్నుకు రూ.60 కొనుగోలు పన్నుగా రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఈ డబ్బునే ప్రభుత్వం తిరిగి రైతులకు ప్రోత్సాహక ధరగా 2002-03 సీజన్‌ నుంచి చెల్లిస్తోంది. అయితే ప్రస్తుతం జీఎస్టీ అమలులో ఉన్నందున ఇక కొనుగోలు పన్ను ఉండదని కర్మాగారాల యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఇదే జరిగితే రైతులు టన్నుకు రూ.60 నష్టపోతారు. జిల్లాలో మూడు కర్మాగారాలు గానుగాడుతున్నాయి. ఇప్పటికే తాండవ, ఏటికొప్పాక గానుగాట ముగించాయి. గోవాడ గానుగాడుతోంది. ఈ మూడు కర్మాగారాలు కలిపి ఏడులక్షల టన్నులు గానుగాడవచ్చని అంచనా. అంటే ఈ లెక్కన ప్రోత్సాహక ధర రూపంలో రైతులకు రావల్సిన రూ.4.20 కోట్లు  నష్టపోతారు. కొనుగోలు పన్ను లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఏమైనా ప్రోత్సాహక ధర చెల్లిస్తుందో లేదా చూడాల్సి ఉంది. నిబంధనల  ప్రకారం కొనుగోలు పన్ను చెల్లించిన తర్వాతే పంచదార అమ్మాలి. అయితే ఈ సీజన్‌లో గోవాడ కర్మాగారం పంచదార అమ్మినా ఎటువంటి పన్ను చెల్లించలేదు.

ఎటువంటి ఉత్తర్వులు లేవు
చెరకు కొనుగోలు పన్నుపై ఇంత వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిందిగా ఇప్పటికే ఉన్నతాధికారులను అడిగాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేనందునే పంచదార అమ్మకాలు చేసినా ఇంకా పన్ను వసూలు చెయ్యలేదు. గత రెండేళ్లగా గానుగాట పూర్తిగా ముగిసిన తర్వాతే పన్నుకు సంబంధించిన ఉత్తర్వులు వచ్చేవి. ఈ పర్యాయం ఏవిధంగా ఉత్తర్వులు వస్తాయో చూడాల్సి ఉంది.

– జీవీవీ సత్యనారాయణ, చెరకు అభివృద్ధి మండలి సహాయ కమిషనర్‌

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo