ఇంటింటా మరుగుదొడ్డి తప్పనిసరి
ఇంటింటా మరుగుదొడ్డి తప్పనిసరి
తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకురండి
నర్సీపట్నం డివిజన్ సమీక్షలో కలెక్టర్
నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: ‘పాఠశాలలకు వెళ్లండి. విద్యార్థులతో మాట్లాడండి. ఇళ్లలో మరుగుదొడ్డి ఉన్నదీ.. లేనిదీ తెలుసుకోండి. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటా మరుగుదొడ్డి ఉండాలన్న లక్ష్యం చేరుకోవాలి. విద్యార్థులు, వారి ద్వారా తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాల’ని జిల్లా కలెక్టర్ ప్రవీణüకుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక కృష్ణా ప్యాలెస్‌లో స్వచ్ఛభారత్ మిషన్ – ఓడీఎఫ్‌పై మంగళవారం డివిజన్ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మరుగుదొడ్డి ఉంటే.. వినియోగిస్తున్నదీ.. లేదని తెలుసుకోవాలని; మరుగుదొడ్డి లేకుంటే నిర్మించుకునేలా చూడాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకోలేని నిరుపేదలకు సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా పారిశ్రామిక వేత్తలు, కంపెనీల సహకారం తీసుకుని పూర్తి చేయించాలన్నారు. ముందుగా కొన్ని గ్రామాలను ఎంచుకుని శత శాతం నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. 2018 ఫిబ్రవరి 15లోగా జిల్లాలో నూర శాతం మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి కావాల్సి ఉందన్నారు. నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేందుకు ప్రతి ఒక్కరూ సమగ్ర కార్యాచరణతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే నోడల్ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. నిర్మాణ సామగ్రి, రవాణా సమస్యలకు మండల స్థాయిలోనే అధికారులు పరిష్కారం చూపాలన్నారు. స్థలాల సమస్యను రెవెన్యూ అధికారులు పరిష్కరించాలన్నారు. ఇటుక, సిమెంటు నిల్వలను టోకున కొనుగోలు చేయిస్తే ఖర్చు తగ్గుతుందన్నారు. ఉత్సాహంగా పనిచేసి లక్ష్యాలను చేరుకున్న వారికి గణతంత్ర దినోత్సవం రోజున నగదు బహుమతులు అందజేస్తామని చెప్పారు. శాఖల వారీగా ప్రోత్సాహకాలు ఉంటాయని పేర్కొన్నారు. లక్ష్య సాధనలో వెనుకబడినా, విఫలమైనా వేతనాలు నిలిపేస్తామని, అవసరమైతే క్రమశిక్షణ చర్యలూ తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు కల్యాణచక్రవర్తి, జడ్పీ సీఈవో జయప్రకాశ్‌నారాయణ్, జిల్లా పంచాయతీ అధికారి కృష్ణవేణి, నర్సీపట్నం రెవెన్యూ డివిజినల్ అధికారి కృష్ణకుమారి, డివిజనల్ పంచాయతీ అధికారి శిరీషారాణి, పది మండలాలకు చెందిన ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Notice: compact(): Undefined variable: limits in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
821
Notice: compact(): Undefined variable: groupby in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
821
Warning: count(): Parameter must be an array or an object that implements Countable in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
399