ఇంజినీరింగ్ విద్యార్థుల ప్రతిభ
ఇంజినీరింగ్ విద్యార్థుల ప్రతిభ
రూ.లక్ష నగదు ప్రోత్సాహకం
సాగర్‌నగర్, న్యూస్‌టుడే: విజయవాడలో ఈనెల 17, 18, 19 తేదీల్లో ‘స్టార్ట్ ఏపీ ఫెస్టు-2017’ పేరిట నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో గాయత్రీ విద్యాపరిషత్ (జీవీపీ) స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ (రుషికొండ) విద్యార్థులు ప్రథమస్థానంలో నిలిచారని జీవీపీ కార్యదర్శి డి.దక్షిణామూర్తి, డైరెక్టర్ ఎ.రామకృష్ణ తెలిపారు. జాతీయస్థాయిలో ‘మేడ్ ఎబౌట్ ఐడియాస్’ (వినూత్నమైన ఆలోచనలు) అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేటివ్ సొసైటీ, స్టాంüü్ట ఏపీ సంయుక్తంగా ఈ పోటీలు నిర్వహించారన్నారు. ఈసీఈ తృతీయ సంవత్సరం విద్యార్థులు జి.భరత్‌యాదవ్, టి.సునీల్రాజులు స్మార్ట్ వ్యవసాయానికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా పోటీలో ఈ అంశం జాతీయ స్థాయిలో ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. వ్యవసాయం సాగుచేసే క్రమంలో ఆయా పంటల ఉత్పత్తిని పెంచి లాభాలబాటలో రైతులు పయనించడం, విద్యుత్తు తదితర వ్యయాలను తగ్గించడం, తక్కువ మందితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించడం, రైతుల ఆత్మహత్యలకు ఆస్కారం లేకుండా చర్యలు తదితర ప్రయోజనకర ప్రధానాంశాలను నిపుణులకు వివరించడంతో ప్రథమ స్థానానికి అర్హత సాధించారన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఏపీ ఇన్నోవేటివ్ సీఈవో నిఖిల్అగర్వాల్ చేతులమీదుగా రూ.లక్ష నగదు ప్రోత్సాహకాన్ని అందుకున్నారన్నారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ (అమెరికా)కు వెళ్లి అక్కడ చేపడుతున్న పరిశోధనలను అధ్యయనం చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ఈ సందర్భంగా సోమవారం జరిగిన కార్యక్రమంలో జీవీపీ సంయుక్త కార్యదర్శి డి.కామేశ్వరరావు తదితరులు సంబంధిత విద్యార్థులకు జ్ఞాపికలు, ధువ్రపత్రాలను అందజేసి అభినందించారు. తాము అందుకున్న రూ.లక్ష నగదు ప్రోత్సాహకాన్ని రైతులకు మరింత మేలు చేకూర్చేదిశగా మరిన్ని విస్తృత పరిశోధనలు మున్ముందు చేపట్టేందుకు వినియోగిస్తామని విద్యార్థులు భరత్‌యాదవ్, సునీల్రాజు స్పష్టంచేశారు.
Notice: compact(): Undefined variable: limits in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
821
Notice: compact(): Undefined variable: groupby in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
821
Warning: count(): Parameter must be an array or an object that implements Countable in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
399