News

Realestate News

ఆహ్లాదకరంగా లాసన్స్‌బే తీరం

News Visakhapatnam

ఆహ్లాదకరంగా లాసన్స్‌బే తీరం
జూన్‌ 15వ తేదీకి పార్కును సిద్ధం చేయాలి
ఆదేశాలు జారీ చేసిన కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌
ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే: విశాఖ పోర్టు ట్రస్టు సహకారంతో జీవీఎంసీ నూతనంగా నిర్మిస్తున్న లాసన్స్‌బేకాలనీ పార్కును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని జీవీఎంసీ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన లాసన్స్‌బేకాలనీ తీరానికి వచ్చారు. నిర్మాణంలో ఉన్న పార్కు పనులను పర్యవేక్షించారు. పదిరోజుల్లో పనులను పూర్తి చేయాలని, అవసరమైన అన్ని సదుపాయాలతో పాటు మరిన్ని హంగులను సమకూర్చాలన్నారు. పార్కు పరిసరాల్లో ప్రజా మరుగుదొడ్లను నిర్మించామని, ఉదయం, రాత్రి సమయాల్లో భద్రత సిబ్బంది కాపాలా కాస్తున్నారని జీవీఎంసీ ఉద్యాన శాఖాధికారి దామోదర్‌ కమిషనర్‌కు వివరించారు. పార్కుకు ఆనుకుని ఉన్న బీచ్‌ను చదును చేసి చెత్త లేకుండా చూడాలని కమిషనర్‌ ఆదేశించారు. ఆర్కేబీచ్‌, రుషికొండబీచ్‌లు రద్దీగా మారిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా లాసన్స్‌బేకాలనీ పార్కును ఏర్పాటు చేస్తున్నామని, సందర్శకులను ఆకర్షించేలా తీర్చిదిద్దాలని సూచించారు. జూన్‌ 15 నాటికి పార్కును ప్రారంభించటానికి సిద్ధం చేయాలని ఆదేశించారు.