News

Realestate News

ఆహ్లాదంగా ఆంధ్రా వూటీ

ఆహ్లాదంగా ఆంధ్రా వూటీ
అరకులోయ, న్యూస్‌టుడే:
ఆంధ్రావూటీ అరకులోయలో సందర్శకుల తాకిడి ఎక్కువైంది. దసరా సెలవులను ఉల్లాసంగా గడిపేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యటకులు అరకులోయకి వస్తుండటంతో సందర్శిత ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానం తదితర ప్రాంతాల వద్ద రద్దీ వాతావరణం నెలకొంది. మరోవైపు అతిథిగృహాలన్నీ పర్యటకులతో నిండిపోయాయి. ప్రైవేట్‌, పర్యటక అతిథిగృహాల్లో ఖాళీ లేకపోవటంతో ప్రత్యామ్నాయ మార్గాల వైపు సందర్శకులు పరుగులు తీస్తున్నారు. పర్యటకుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో లాడ్జిల అద్దెలు సైతం పెరిగిపోయాయి. సందర్శకుల తాకిడితో అరకులోయ రహదారులు సందడిగా మారాయి. ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo