News

Realestate News

ఆహా.. ‘పచ్చని’ నగరం..!

vsp-brk4a

ఆహా.. ‘పచ్చని’ నగరం..!
దీపాంజలినగర్‌లో తొణికిసలాడుతున్న పచ్చదనం
మైమరిచిపోతున్న సందర్శకులు
పరవాడ, న్యూస్‌టుడే
సింహాద్రి ఎన్టీపీసీ దీపాంజలినగర్‌లో పచ్చదనం పరవళ్లు తొక్కుతోంది. టౌన్‌షిప్‌ లోపల అడుగుపెట్టే వారికి రంగురంగుల పూలమొక్కలు, క్రోటన్స్‌ మొక్కలు స్వాగతం పలుకుతాయి. ఇక్కడ సింహాద్రి ఎన్టీపీసీకి చెందిన 800 కుటుంబాల ఉద్యోగులు నివసిస్తున్నారు. రహదారుల వెంబడితోపాటు సుముద్రిక, శారద అతిథి గృహాలతో పాటు శకుంతల ఆడిటోరియం, ఆసుపత్రి, సామాజిక భవనం, సాగరిక రిక్రియేషన్‌ క్లబ్‌, తరంగం క్లబ్‌, దీపికా లేడీస్‌ క్లబ్‌, పార్కులు, బాలభారతి పబ్లిక్‌స్కూల్‌ తదితర ప్రాంతాల్లో ఎజ్జోరా, ముసుండా, బిల్లగన్నేరు, ఉప్పర మిలియా ఇంకిరోజా తదితర పూలమొక్కలతో పాటు క్రోటన్‌ మొక్కలు ఏపుగా పెరిగి కనువిందు చేస్తున్నాయి.

* ఉద్యోగులు కూడా క్వార్టర్స్‌ పరిసరాల్లో మొక్కలు పెంచి సంరక్షిస్తున్నారు. రెండేళ్ల క్రితం వచ్చిన హుద్‌హుద్‌ తుపాను దాటికి మొక్కలతో పాటు పచ్చదనం మొత్తం దెబ్బతిన్నా మొక్షవోని దీక్షతో ప్లాంట్‌ యాజమాన్యం, సంస్థ ఉద్యోగులు లక్షలాది సంఖ్యలో మొక్కలు నాటి సంరక్షించారు. ఫలితంగా మళ్లీ పచ్చదనం రూపుదిద్దుకుని ఆహ్లాదం పంచుతోంది.

* ఇక్కడ మొక్కనాటి నుంచి అవి పెరిగి పెద్దవయ్యే వరకు చూడడానికి సుమారు 50మంది కార్మికులను నియమించారు. వీరంతా నిత్యం మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో టౌన్‌షిప్‌లో ఏ మూలన చూసినా పచ్చదనం తొణికసలాడుతోంది.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo