News

Realestate News

ఆలోచన మెరిసె… ఆనకట్టు వెలసె..!

vizag realestate news

ఆలోచన మెరిసె… ఆనకట్టు వెలసె..!
వృథా, వర్షం నీరంతా భూమిలోకే..
పెరిగిన భూగర్భ జలాలతో పచ్చదనం కళకళ

పదేళ్ల కిందటి వరకు అక్కడ కురిసిన వర్షపు నీరు వృథాగా సముద్రంలో కలిసిపోయేది. ఆ నీటిని ఎక్కడికక్కడ నిల్వ చేస్తే… భూ గర్భజలాలు పెరుగుతాయన్న ఆలోచన అప్పటివరకు ఎవరికీ రాలేదు. సముద్రంలో కలిసిపోతున్న నీటికి అడ్డుకట్ట వేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఓ వ్యక్తి బుర్రలో మెదిలింది. దీనికి ప్రభుత్వ యంత్రాంగం కూడా సహకరించడంతో వృథా నీటిని ఒడిసి పడుతున్నారు. భారీ వ్యయమైనా ఆ వ్యక్తి వెనక్కి తిరిగి చూడలేదు. ఫలితంగా ఈ రోజున ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు మెండుగా ఉండడం, పచ్చదనం కళకళలాడుతున్నాయి.

గర శివారులోని గంభీరం, కాపులుప్పాడ గ్రామాలను ఆనుకొని ఒక స్థిరాస్తి వ్యాపార సంస్థ 2005లో 150 ఎకరాల్లో లేఅవుట్‌ వేసింది. వుడా భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టుని చేపట్టారు. లేఅవుట్‌ను ఆనుకుని ఉన్న ఓ కాలువలో గంభీరం జలాశయం నుంచి వర్షకాలంలో వచ్చే అదనపు నీరు వృథాగా సముద్రంలోకి వెళ్లే ఏర్పాటు ఉండేది. చాలా ఏళ్లు దాదాపు ఇదే పరిస్థితి. లేఅవుట్‌ నిర్వాహకుడు సీహెచ్‌. శ్రీనివాస్‌ నీటి సంరక్షణ కోసం ఆలోచనలు చేశారు. ప్రభుత్వశాఖల అధికారులు ప్రోత్సహించడంతో దాదాపు 3 కిలోమీటర్ల పొడవు ఉన్న కాలువలో ఎక్కడికక్కడ నీటి సంరక్షణ చర్యలు చేపట్టారు. పూడికలు తొలగించడం, చెక్‌డాంలు నిర్మించడంతో నీటికి అడ్డుకట్ట పడింది. దీని వల్ల లేఅవుట్‌ పరిధితో పాటు చుట్టుపక్కల పల్లెల్లోనూ భూగర్భ జలాలు పెరిగాయి. ఇక్కడ బోర్లు తీసినా, పంపులు వేసినా, బావులు తవ్వించినా 50 నుంచి 60 అడుగుల్లోనే నీరు వస్తోంది. పదేళ్ల కిందట ఇదే ప్రాంతంలో 150 అడుగులకుపైగా తవ్వితేనే నీరు లభించేదని స్థానికులు చెబుతున్నారు.

సహజ వనరుల సంరక్షణకు ప్రాధాన్యం
నీటి సంరక్షణ, జంతువులు, మొక్కల పెంపకం అంటే ఎంతో ఇష్టం. అందుకే సముద్రంలో కలిసిపోతున్న నీటిని చూశాక.. సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్న ఆలోచన వచ్చింది. వివిధ ప్రభుత్వశాఖల అధికారుల నుంచి అనుమతులు రావడంతో ఖర్చు ఎక్కువైనా సంరక్షణ పనులు చేపట్టాం. ఆ ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నాం. నాతో పాటు ఇక్కడ నివాసం ఉంటున్న వారంతో నీటి పొదుపునకు సహకరించడం ఎంతో ఆనందంగా ఉంది.

– సీహెచ్‌ శ్రీనివాస్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌, చిలుకూరి హౌసింగ్‌ ప్రాజెక్ట్సు

Source : http://www.eenadu.net/