News

Realestate News

ఆర్థిక పురోగతి దిశగా… షిప్‌యార్డు

 

ఆర్థిక పురోగతి దిశగా… షిప్‌యార్డు

సంస్థ సీఎండీ రియర్‌అడ్మిరల్‌ శరత్‌బాబు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: పురాతన నౌకానిర్మాణ కేంద్రం ‘హిందుస్థాన్‌ షిప్‌యార్డు’ ఆర్థిక స్వావలంబన, స్వయం సమృద్ధి దిశగా పయనిస్తోందని సంస్థ సీఎండీ, రియర్‌ అడ్మిరల్‌ ఎల్వీ శరత్‌బాబు అభిప్రాయపడ్డారు. అనునిత్యం భద్రతపై సమీక్షలు జరుపుతూ… యార్డులో ప్రమాదాలకు తావులేకుండా నిరాటంక ఉత్పత్తిని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం యార్డులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంస్థ ఏడు దశాబ్దాల చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఉత్పత్తి, లాభాలను ఆర్జించామని పేర్కొన్నారు. ఉద్యోగుల నియామకాల్లో రిజర్వేషన్ల శాతానికి మించి ఆయా వర్గాలకు చోటు కల్పిస్తున్నామన్నారు. కార్మికుల నైపుణ్యత పెంచేదిశగా 78 మందికి ఐటీఐ అప్రెంటీసు అభ్యర్థులకు, 47 మంది ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు, 21 మంది డిప్లమో అభ్యర్థులకు గత ఏడాది ప్రత్యేక శిక్షణ అందించామన్నారు. వివిధ ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులు 1960 మందికి ప్రాజెక్టు వర్క్స్‌లో పారిశ్రామిక శిక్షణ ఇచ్చామన్నారు. ప్రస్తుతం కొన్ని వెసల్స్‌ నిర్మాణ దశలో ఉన్నాయని, మరికొన్ని సీ ట్రయిల్‌కు వెళ్లనున్నాయని చెప్పారు. త్వరలోనే వీటిని ఆయా సంస్థలకు అప్పగిస్తామన్నారు. భవిష్యత్తులో ఫ్లీట్‌ సపోర్టు వెసల్స్‌, డైవింగ్‌ సపోర్టు వెసల్స్‌, బొలార్డ్‌ టగ్‌ల నిర్మాణానికి ఆర్డర్లు రానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సామాజిక బాధ్యతగా గత ఏడాదిలో రూ.11.40 లక్షలను వివిధ కార్యక్రమాలకు వెచ్చించామన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo