Posted on November 30, 2016 by vijay kumar in Realestate News
ఆర్టీసీలో స్వైపింగ్ మిషన్ సేవలు
సీతంపేట, న్యూస్‌టుడే : కేంద్ర ప్రభుత్వం పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేయడంతో నగదు వాడకాన్ని తగ్గించే చర్యల్లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్ర స్థానిక ద్వారకా బస్‌స్టేషన్‌లో స్వైపింగ్ మిషన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. భారతీయ స్టేట్ బ్యాంక్ అందించిన ఈ స్వైపింగ్ మిషన్‌ను విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా నగరం న్యూయార్కులో ప్రయాణికుల సౌకర్యార్ధం క్యాష్కార్డులు అందిస్తారని, అలాంటి సేవలు రావాలన్నారు. విదేశాల్లో డెబిట్, క్రెడిట్, క్యాష్ కార్డులు వినియోగంలో ఉంటాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పది లక్షల వరకు స్వైపింగ్ మిషన్ సేవలు వినియోగంలోకి తీసుకురావాలని తలపోస్తోందని, ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నగదు రహిత పాలన అందించాలని భావిస్తున్నారని చెప్పారు. ఆర్టీసీలో కండక్టరు లేని బస్సు ప్రయాణం రావాలంటే విరివిగా స్వైపింగ్ మిషన్లు వాడాలని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ ఈడీ ఎ.రామకృష్ణ మాట్లాడుతూ ఆర్టీసీలో స్వైపింగ్ మిషన్లతోపాటు నగదుతో కూడా టికెట్లు ఇస్తారని చెప్పారు. దశలవారీ నగదు వాడకాన్ని తగ్గించి స్వైపింగ్ మిషన్లు పెంచుతామని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం డివిజన్లలో 40వరకు స్వైపింగ్ మిషన్లను స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి హెచ్డీఎఫ్సీ బ్యాంకు 46 మిషన్లు అందించిందని తెలిపారు. కార్యక్రమంలో భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రాంతీయ ప్రబంధకులు మదన్మోహన్ ఈడీ రామకృష్ణకు స్వైపింగ్ మిషన్ అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్.బి.ఐ. చీఫ్ మేనేజర్ మంగరాజు, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జి.సురేష్‌కుమార్, సీహెచ్ అప్పలనారాయణ, ఎం.సుధాబిందు తదితరులు పాల్గొన్నారు. Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821
Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821
Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399