News

Realestate News

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలి

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలి
పెదవాల్తేరు, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించడానికి సరైన ప్రణాళికలు రూపొందించాలని ఎమ్మెల్సీ ఎం.వి.వి.ఎస్‌.మూర్తి తెలిపారు. శాసన మండలిలో గురువారం ఎమ్మెల్సీ మూర్తి మాట్లాడుతూ ఎయిడ్స్‌ వ్యాధి ఏపీలో అగ్రస్థానంలో ఉందని గమనించాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పలు సీజన్లలో అధిక సంఖ్యలో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సంఘటిత, అసంఘటిత కార్మికుల ఆరోగ్య భద్రత కోసం హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలన్నారు. ఏడాదిలో రెండు విడతలుగా పూర్తిస్థాయి వైద్య పరీక్షలు జరిపించడం ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.