ఆయిల్‌పామ్ రైతులకు శుభవార్త

కృష్ణదేవిపేట, న్యూస్‌టుడే
విశాఖ గ్రామీణ జిల్లాలో ఆయిల్‌పామ్ రైతులకు శుభవార్త. బుధవారం నుంచి ఆయిల్‌పామ్ ధరలు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో టన్ను ఆయిల్పామ్నకు రూ.7200 ధర చెల్లించగా, ఈ నెల ఏడో తేదీ నుంచి టన్ను రూ.7792కు పెంచుతున్నట్లు రికీ సోయా ఇండ్రస్ట్రీస్ ఏరియా మేనేజరు వెంకటమురళి తెలిపారు. గ్రామీణ జిల్లాలో పది వేల ఎకరాలకు పైగా ఆయిల్‌పామ్ సాగు జరుగుతోందని ఏరియా మేనేజరు వెంకటమురళి తెలిపారు. ఈ ప్రాంతాల్లో రైతులకు సంబంధించి రాయితీలు పొందే విధంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈమేరకు ధరల పెంపుపై రోలుగుంట, నర్సీపట్నం, గొలుగొండ, కొయ్యూరు మండలాల్లో రైతులకు సమాచారం అందించేలా చర్యలు చేపడుతున్నామని ఏరియా సిబ్బంది ఎస్.కళ్యాణం, గొర్లి తాతాజీ, గండేపల్లి సత్యన్నారాయణ తెలిపారు.