News

Realestate News

ఆపదొస్తే అప్రమత్తమిలా…

 

ఆపదొస్తే అప్రమత్తమిలా…

బొడ్డుగురయ్యపేట తీరంలో సునామీ మాక్‌డ్రిల్‌

పూసపాటిరేగ(భోగాపురం), న్యూస్‌టుడే: సముద్రంలో సునామీ వస్తే ఎలా ఎదుర్కొవాలనే సమాయత్తంపై నమూనా కసరత్తును బుధవారం చేపట్టారు. జాతీయ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ, భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎటువంటి జాగ్రత్తలు, రక్షణ చర్యలు తీసుకోవాలో ప్రదర్శించారు. ఆర్డీవో మురళి, తహసీల్దారు సూర్యలక్ష్మి పర్యవేక్షణలో జరిగిన మాక్‌డ్రిల్‌లో మత్స్యకారులను అప్రమత్తం చేస్తూ . అధికారులు, సిబ్బంది పరుగులు తీస్తూ సునామీపై సన్నద్ధత కార్యక్రమాలను అంశాల వారీగా నిర్వహించారు. మెరైన్‌ ఎస్‌ఐ రవికృష్ణ, ఏఎస్‌ఐ కోటేశ్వరరావు, మత్స్యశాఖ డీడీ దివాకర్‌రావు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ఎస్‌ఐ జి.శివప్రసాద్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఏఎస్‌ఐ టి.ఎం.రావు, స్థానిక నాయకులు దంగా భూలోక తదితరలు పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo