News

Realestate News

ఆధునికీకరణ దిశగా రైతుబజార్లు

Real Estate News

నగరంలో సంచార రైతుబజార్లు ఏర్పాటు
త్వరలో రైతుల జంబ్లింగ్‌

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే: నగరంలోని అన్ని రైతుబజార్లను ఆధునికీకరిస్తూ, రైతులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నామని వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖమంత్రి పి.పుల్లారావు అన్నారు. మంగళవారం ఉదయం ఎంవీపీకాలనీ రైతుబజారులో రూ.48లక్షలతో నిర్మించిన శీతలగిడ్డంగి, పండ్లను మగ్గపెట్టే ఛాంబర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా, వినియోగదారులకు తక్కువ ధరలకు కూరగాయలు లభించేందుకు చంద్రబాబునాయుడు హయాంలో ఏర్పాటుచేసిన రైతుబజార్లను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. అయితే తెదేపా ప్రభుత్వ హయాంలో మరోసారి వీటిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా విశాఖలోని 12 రైతుబజార్ల అభివృద్దికి అవసరమైన నిధులను విడుదల చేశామని పేర్కొన్నారు. అలానే ఫామ్‌ టు హోమ్‌ పేరిట వ్యవసాయ క్షేత్రం నుంచే నేరుగా ఇంటికి కూరగాయలు విక్రయించే విధానాన్ని ప్రవేశపెడుతున్నామన్నారు. రైతుబజార్లు లేని ప్రాంతాల్లో, జనావాసాలు ఎక్కువుగా ఉండే ప్రాంతాలను గుర్తించి, సంచార రైతుబజార్లను అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు. సంచార రైతుబజార్లలో భాగంగా నిరుద్యోగ యువతకు సబ్సిడీపై వాహనాలను అందజేస్తున్నామన్నారు. నగరానికి కూడా సంచార రైతుబజార్లను మంజూరు చేశామన్నారు. అలానే వ్యయసాయం నుంచి ఉద్యానవన పంటలకు మారిన రైతులను గుర్తించే పనిలో ఉన్నామని, ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి రైతులను మార్చాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో జంబ్లింగ్‌ విధానం అమలు చేసామని.. విశాఖలో కూడా రైతులను మార్పు చేసేందుకు చర్యలు తీసుకుంటుమన్నారు. అధికారులు నివేదిక రూపొందించాలని ఆదేశించారు. రైతుబజార్లలో పెంచిన ధరలపై ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా, డ్వాక్రా, వ్యాపారులు ఇబ్బంది పెట్టేలా కాకుండా, అవసరం మేరకు మాత్రమే పెంచేలా చూడాలని మంత్రి పుల్లారావు ఆధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, సంయుక్త కలెక్టర్‌ -2 డి.వి.రెడ్డి, మార్కెటింగ్‌ శాఖ జేడీ శ్రీనివాస్‌, డి.డి. సుధాకర్‌, ఎస్‌.టి.నాయుడు, ఎ.డి. కాళేశ్వరరావు, ఉద్యానవనశాఖ ఎ.డి. ప్రభాకర్‌, తెదేపా ప్రధాన కార్యదర్శి సి.వి.పట్టాబిరామ్‌, తెదేపా నాయకులు నెక్కంటి సత్యనారాయణ, ఎస్టేట్‌ అధికారులు వరహాలు, ప్రసాద్‌, జగదీష్‌, ఉద్యావనశాఖాదికారులు శ్యామల, రాధిక తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో రూ.4లక్షల యూనిట్‌లను స్థాపించిన 20 మంది రైతులకు రూ.40లక్షల విలువ చేసే ప్యాక్‌þ హోమ్‌ మంజూరు పత్రాలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. అదేవిధంగా డాబాపై ఉద్యానవనం పథకానికి సంబంధించిన యూనిట్‌లను కొనుగోలు చేసిన వారికి అందజేశారు. అనంతరం పలువురు డ్వాక్రా మహిళలు, వ్యాపారులు వారి సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు అందజేశారు.


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo