News

Realestate News

ఆదిత్యుని సన్నిధికి భక్తులతాకిడి

ఆదిత్యుని సన్నిధికి భక్తులతాకిడి
అరసవల్లి, న్యూస్‌టుడే: అరసవల్లి సూర్యనారాయణస్వామి వారిని ఆదివారం భక్తులు అధికసంఖ్యలో దర్శించుకున్నారు. మాఘమాసం ఆదివారం కావడంతో భక్తులసంఖ్య పెరిగింది. ఉచిత, రూ.25 క్యూలైన్లలో స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేశఖండనశాలలో స్థలాభావం కారణంగా నిల్చునే తలనీలాలు సమర్పించాల్సి వచ్చింది. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ప్రత్యేక పూజలు చేశారు. ఇంద్రపుష్కరిణి ఆవరణలో భక్తులు నైవేద్యం వండి సూర్యునికి చెల్లించారు. అన్నప్రసాదాన్ని స్వీకరించారు.