News

Realestate News

ఆదర్శపాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలి


ఆదర్శపాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలి

పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే:ఆదర్శపాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలి…

ఆదర్శ పాఠశాల(మోడల్స్‌ స్కూళ్ల)ల్లో ఉత్తీర్ణతా శాతాన్ని పెంపొందించేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకుని,

కృషి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి ఆదేశించారు.

ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశమందిరంలో మోడల్స్‌ స్కూల్స్‌ జోనల్‌ సమీక్షా సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

మోడల్‌ స్కూలు విద్యార్థులను ఐ.ఐ.టి., ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయాలని, అందుకు అవసరమైన తర్పీదు ఇవ్వాలని సూచించారు.

ఇంటర్మీడియట్‌ విద్యార్థుల సంఖ్యను ఇంకా పెంచాల్సి ఉందన్నారు.

ఇంటర్మీడియట్‌ విద్యార్థుల ఉత్తీర్ణత పెంపొందించేలా దృష్టి సారించాలన్నారు.

అనంతరం మోడల్‌ స్కూల్స్‌ విద్యాప్రగతిపై సమీక్షించారు.

జేడీ నర్సింహరావు, విశ్రాంత డైరెక్టర్‌ పుల్లయ్య, డైరెక్టర్‌ ప్రభాకర్‌, డీఈవోలు నాగమణి, లింగేశ్వరరెడ్డి, సాయిరామ్‌, శ్రీకాకుళం, విజయనగరం,

విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల ప్రిన్సిపాళ్లు, వార్డెన్లను పాల్గొన్నారు.

వార్డెన్లు తమ జీతాలు పెంచాలని, వారాంతపు సెలవు కావాలని కోరారు.

ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.