ఆడుతూ పాడుతూ చదవాలి
ఆడుతూ పాడుతూ చదవాలి
ముగిసిన జూనియర్ కళాశాలల క్రీడా పోటీలు
ఇంటర్ స్థాయిలో విద్యార్థులు ఆడుతూ, పాడుతూనే శ్రద్ధగా చదువుకోవాలని ఇంటర్మీడియట్ జిల్లా పర్యవేక్షణాధికారి టి.నగేష్‌కుమార్ సూచించారు.
నర్సీపట్నంలో రెండు రోజులపాటు నిర్వహించిన జూనియర్ కళాశాలల బాలికల జిల్లాస్థాయి క్రీడల పోటీలు మంగళవారంతో ముగిశాయి.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ప్రభుత్వం క్రీడలకు ప్రోత్సాహం ఇస్తోందన్నారు.
త్వరలో నిర్వహించే గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు జిల్లా నుంచి ఎంపిక చేసిన విద్యార్థులను పంపిస్తామని తెలిపారు.
జిల్లావృత్తి విద్యా అధికారి ఎంవీఎన్ పాత్రుడు మాట్లాడుతూ వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపామని తెలిపారు.
ఎంపీపీ సుకల రమణమ్మ,
పోటీల నిర్వాహక కమిటీ కార్యదర్శి జి.రాంబాబు తదితరులు ప్రసంగించారు.
తొలుత పాత్రుడుకి వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులను పరిచయం చేశారు.
అనంతరం తుది పోటీలను నిర్వహించారు.
కబడ్డీలో చివరి వరకు పోరాడిన గిరిజన బాలిక వసంతకుమారికి ఆర్ఐఓ రూ.1000, వ్యాయామ ఉపాధ్యాయుడు ఒకరు రూ. 500 బహుమతిగా
అందజేసి ప్రోత్సహించారు.
కబడ్డీలో విశాఖపట్నం ఏఎస్‌రాజా కళాశాల,
ఖో-ఖోలో అనకాపల్లి ఏఎంఏఎల్ కళాశాల,
వాలీబాల్‌లో అరకు కళాశాల, త్రో బాల్లో విశాఖ మహిళా కళాశాల,
టెన్నికాయిట్‌లో అనకాపల్లి ఏఎంఏఎల్ కళాశాల జట్లు జిల్లాస్థాయిలో ప్రథమస్థానం సాధించాయి.
ద్వితీయస్థానంలో వాలీబాల్‌లో నర్సీపట్నం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాల,
టెన్నికాయిట్‌లో అరకువ్యాలీ గిరిజన బాలికల కళాశాల,
త్రోబాల్‌లో అరకు కళాశాల, కబడ్డీలో పాడేరు గిరిజన బాలికల కళాశాల,
ఖోఖోలో గాజువాక శ్రీసాయిశక్తి బాలికల కళాశాల విద్యార్థినులు విజేతలుగా నిలిచారు.
27 కళాశాలల నుంచి దాదాపు 600 మంది బాలికలు ఈ పోటీలకు హాజరయ్యారు.
విజేతలకు ఎంపీపీ రమణమ్మ జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.