ఆగస్టులో అంతర్జాతీయ ప్రో క్యారమ్స్ లీగ్

క్రీడలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం
పోటీల లోగో ఆవిష్కరలో మంత్రి గంటా
విశాఖ క్రీడలు, న్యూస్టుడే: నగరంలో క్రీడలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో ఆయన అంతర్జాతీయ ప్రో క్యారమ్స్ లీగ్ పోటీల లోగోను ఆవిష్కరించారు. ఈ పోటీలు ఆగస్టులో నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ క్యారమ్స్ క్రీడ దాదాపు కనుమరుగైందని, ఇలాంటప్పుడు ప్రో క్యారమ్స్ పోటీల నిర్వహణకు క్యారమ్స్ సంఘం ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అఖిల భారత క్యారమ్స్ సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ నీరజ్ సంపథీ, ది ఒలింపిక్స్ సంఘం అధ్యక్షుడు టి.ఎస్.ఆర్.ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.