ఆకాశమార్గాన…
ఆకాశమార్గాన…
ముందుగా నగరంలో.. తర్వాత అరకు- అన్నవరం
డీజీసీఏ అనుమతుల దశలో హెలీటూరిజం ప్రాజెక్టు

ముందుకొచ్చిన మరో రెండు సంస్థలు.. వుడాతో సంప్రదింపులు హైదరాబాద్‌లో పది నిమిషాలకు టిక్కెట్ ధర రూ. 3,500. విశాఖలో మాత్రం 10 నిమిషాలకు ధర రూ. 2,500గా నిర్ణయించాలని వుడా భావిస్తోంది. తొలిదశలో కైలాసగిరి, షిప్‌యార్డు, ఎర్రమట్టి దిబ్బలు, ఆర్కే బీచ్ తదితర ప్రాంతాల మీదుగా హెలికాప్టర్ తిరుగుతుంది. సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటే మన్యంలోని అరకుతోపాటు అన్నవరం వరకు పొడిగిస్తారు. తొలుత సింగిల్ ఇంజిన్, ఐదు సీట్ల సామర్థ్యంతో ఉన్న హెలికాప్టర్‌ను అందుబాటులోకి తెస్తారు. రద్దీ పెరిగితే.. డబుల్ ఇంజిన్‌తో కూడిన 12 సీట్ల హెలికాప్టర్‌ను తెస్తారు. అనుమతులన్నీ వచ్చాక ట్రయల్ü రన్ ప్రారంభమవుతుంది. మూడు నెలల తర్వాత వుడా, సంబంధిత సంస్థ ఎంత పెట్టుబడి పెట్టాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.
క్రమంలోనే హెలీ టూరిజం నిర్వహణకు మరో రెండు సంస్థలు వుడాను సంప్రదించాయి. పూర్వ అనుభవం.. సంస్థ పనితీరును దృష్టిలో పెట్టుకుని వుడా తుది నిర్ణయం తీసుకోనుంది. గతంలో స్కై చాపర్స్ సంస్థతో కుదిరిన ఒప్పందం పట్టాలకెక్కకపోవటంతో వుడా రద్దు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పవన్ హ్యాన్స్ సంస్థ రంగప్రవేశం చేసింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతి పొందాక ఈ సంస్థ ట్రయల్‌రన్ మొదలవుతుంది. ఇందుకోసం పవన్హ్యాన్స్ సంస్థ ఏర్పాట్లలో నిమగ్నమైంది.
పోటీ పెరిగింది..: పౌర విమానయాన శాఖ అనుమతుల కోసం పవన్హ్యాన్స్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాజాగా డైమంటో వెర్టికల్స్, మ్యాక్ ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థల ప్రతినిధులు వుడా వీసీని కలిసి హెలీ టూరిజం అవకాశం ఇవ్వాలని కోరారు. గురువారం మ్యాక్స్ డైరెక్టర్ ఎస్ఏ సబీర్.. వుడా వీసీ బసంత్‌కుమార్‌తో భేటీ అయ్యారు. తక్కువ ఛార్జీలకే హెలికాప్టర్ నడుపుతామని ప్రతిపాదించారు. ఈ విషయమై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినందున బ్యాంకు గ్యారంటీ, పూర్వ అనుభవం తదితర అంశాలపై లిఖిత పూర్వకంగా ముందుకొస్తే పరిశీలిస్తామని వుడా వీసీ సూచించారు.

హెలీ టూరిజం ప్రాజెక్టు ప్రస్తుతం అనుమతుల దశలో ఉంది. డీజీసీఏ అనుమతులొచ్చాక ప్రభుత్వ అనుమతితో ట్రయల్ రన్ ప్రారంభిస్తాం. పవన్ హ్యాన్స్ కంపెనీ పూర్వ అనుభవం దృష్టిలో ఉంచుకుని తాత్కాలిక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించాం. ఈ ప్రాజెక్టుపై ఆసక్తితో పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. అన్ని కోణాల్లోనూ పరిశీలించాక తగిన నిర్ణయం తీసుకుంటాం. పర్యాటక ప్రగతిని దృష్టిలో పెట్టుకుని విశాఖలో ప్రారంభించనున్న హెలీ టూరిజం ప్రాజెక్టు సమర్థంగా నిర్వహించాలన్నదే వుడా ఉద్దేశం.