ఆకర్షణీయ ప్రాజెక్టులపై సీఎండీతో చర్చ

ఆకర్షణీయ ప్రాజెక్టులపై సీఎండీతో చర్చ
గురుద్వారా, న్యూస్‌టుడే : వైజాగ్ స్మార్ట్ సిటీ పథకం ప్రణాళికలో భాగంగా అమెరికాకు చెందిన ఏఈసీవోఎం కన్సల్టెంట్ ప్రతినిధుల బృందం తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ కార్పొరేట్ కార్యాలయానికి సోమవారం సాయంత్రం విచ్చేశారు. వైజాగ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులపై సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంఎం నాయక్‌తో సమావేశమయ్యారు. ముందుగా ఏఈసీవోఎం నిర్వాహకులు జాన్ బెచ్మెన్ వైజాగ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు విశేషాలను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. స్మార్ట్ సిటీ పథకంలో ఏపీఈపీడీసీఎల్ నిర్వహించబోయే పాత్ర, అవసరాలపై సీఎండీతో బృందం చర్చించింది. సీఎండీ మాట్లాడుతూ ప్రధానంగా స్కాడా, స్మార్ట్‌మీటరింగ్, రూఫ్‌టాప్ సోలార్ పథకాలకు స్మార్ట్‌సిటీ పథకంలో ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరాన్ని బృందానికి వివరించారు. కార్యక్రమంలో బృందం అసోసియేట్ ప్రిన్సిపల్ రయాన్బౌమా, సీనియర్ ఇంజనీర్ సహనంబాన్, ఈపీడీసీఎల్ డైరెక్టర్లు శేషుకుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.రమేశ్‌ప్రసాద్, వైజాగ్ ఎస్ఈ సత్యనారాయణ మూర్తి, జీఎం, డీఈ, తదితరులు పాల్గొన్నారు.