News

Realestate News

ఆకర్షణీయ ప్రాజెక్టులను పట్టాలెక్కించాలి!

vizagrealestate news

మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి

కార్పొరేషన్‌ :

విశాఖ నగరంలో ఆకర్షణీయ ప్రాజెక్టు ప్రణాళికలను మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవెన్‌ తెలుసుకున్నారు. గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఆయన కమిషనర్‌ హరినారాయణన్‌, ఎయికాం, కేపీఎంజీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రూ. 1602 కోట్లతో చేపట్టనున్న ఆకర్షణీయ ప్రాజెక్టుల గురించి ఈ సందర్భంగా కన్సల్టెన్సీ ప్రతినిధులు వివరించారు. తాగునీరు, భూగర్భ విద్యుత్తు లైన్ల ఏర్పాటు, మురుగునీటి పారుదల వ్యవస్థ, కాలుష్య రహిత రవాణా, నడక మార్గాల ఏర్పాటు అంశాలతోపాటు, మల్టీ లెవల్‌ కార్‌ పార్కింగ్‌, వుడా పార్కు అభివృద్ధిపైనా వివరించారు. అమెరికా ప్రభుత్వ సహకారంతో రూపొందిస్తోన్న ఆకర¿్షణీయ ప్రణాళికలపైనా ఆయన కమిషనర్‌ హరినారాయణన్‌, ప్రధాన ఇంజినీరు చంద్రయ్యను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపడుతున్న పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టుల ప్రాధాన్య క్రమంలో ఎంపిక చేసుకోవాలని సూచించారు. ప్రాజెక్టు మానిటరింగ్‌ సెల్‌(పీఎంసీ) ఏర్పాటు, నిధుల విడుదల అంశాలను ముఖ్య కార్యదర్శి తెలుసుకున్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo