News

Realestate News

ఆకర్షణీయ పాఠశాలలకు జాతీయ అవార్డు


ఆకర్షణీయ పాఠశాలలకు జాతీయ అవార్డు

  • తక్కువ ఖర్చుతో అధునాతన వసతులపై హర్షం జీవీఎంసీ అన్ని పాఠశాలలకూ రూ.52 కోట్ల గ్రాంటు.
  • విశాఖ నగరంలోని పేద పిల్లల పాఠశాలల్ని తక్కువ ఖర్చుతో అధునాతన వసతులతో స్మార్ట్‌ క్యాంపస్‌లుగా మార్చిన

ప్రక్రియ ప్రశంసలందుకుంది.

  • కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ నుంచి సిటీ టు ఇన్వెస్టిమెంట్‌ ఇంటిగ్రేట్‌ అండ్‌ సస్టెయిన్‌ (సీఐటీఐఐఎస్‌)

ఛాలెంజ్‌ కింద జాతీయ అవార్డు దక్కింది.

  • జీవీఎంసీ కమిషనర్‌ ఎం.హరినారాయణన్‌ మంగళవారం దిల్లీలో కేంద్రమంత్రి హర్‌దీప్‌ సింగ్‌ చేతులమీదుగా ఈ

అవార్డును అందుకున్నారు.

  • స్మార్ట్‌సిటీలో భాగంగా రూ.3 కోట్లతో నగరంలోని 4 పాఠశాలల్ని అన్ని హంగులతో సాంకేతిక పరిజ్ఞానంతో

ఆధునికీకరించారు.

  • పాఠశాలల్లో అందుబాటులో ఉన్న తక్కువ స్థలంలోనే ఆటలకు అనువుగా అత్యాధునిక వసతులు, డిజిటల్‌

క్లాస్‌రూములు, తరగతి గదుల్ని తీర్చిదిద్దారు.

  • పాఠశాల ఆవరణం, గోడలు.. ఇలా అన్నీ పిల్లలకు ఆహ్లాదకరంగా ఉండేలా,పచ్చికతో కనిపించడం లాంటివి చేశారు
  • దేశంలో మరే రాష్ట్రంలోనూ ఈవిధంగా లేకపోవడం,పేద పిల్లల పాఠశాలల్లో అన్ని వసతులూ ఒకేచోట ఉండేలా చేయడం అవార్డు వచ్చేందుకు ప్రధాన కారణంగా నిలిచింది.
  • ప్రశంసాపత్రంతో పాటు జీవీఎంసీకి రూ.52కోట్ల గ్రాంటును కూడా విడుదల చేసింది.
  • దీంతో నగరంలోని 146 పాఠశాలల్లో ఇదే తరహా అధునాతన వసతులు పెంపొందించేలా మెరుగులు దిద్దుతామని కమిషనర్‌ ఎం.హరినారాయణన్‌ ‘ఈనాడు’కు తెలిపారు.