News

Realestate News

‘ఆంధ్ర’ వైభవం

‘ఆంధ్ర’ వైభవం

వర్శిటీకి త్వరలో రూ.100 కోట్ల నిధుల విడుదల

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మహర్దశ పట్టడానికి మార్గం సుగమం అయ్యింది. కేంద్రం రాష్ట్రీయ ఉచ్ఛతార్‌ అభియాన్‌ పథకం(రూసా)-2 కింద రూ.100 కోట్లు విడుదల చేయడానికి విశ్వవిద్యాలయాన్ని ఎంపిక చేసిన నేపథ్యంలో భారీఎత్తున అభివృద్ధికి ఆస్కారం కలిగినట్లైంది. కేంద్రం విడుదల చేసే ఆయా నిధులతో వర్సిటీని అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దడానికి వీలుగా అధికారులు పక్కా ప్రణాళికలు రచించారు.
విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థులు సౌకర్యవంతంగా విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి వీలుగా రూ.21.77కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు. వసతిగృహాలు, ప్రయోగశాలలు, తరగతి గదులను ఆధునికీకరిస్తారు. విద్యార్థులకు అవసరమైన అదనపు తరగతి గదులను నిర్మిస్తారు.

నైపుణ్యాభివృద్ధికి చర్యలు
విద్యార్థులు చదువులు, పరిశోధనలతోపాటు వారికి ఉద్యోగ అవకాశాలు పెంచడానికి, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి, మంచి సంస్థల్లో ఉద్యోగాలు రావడానికి వీలుగా పలు నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారు. ముఖ్యంగా వినూత్న ఆలోచనలతో కొత్తకొత్త ఉత్పత్తులు తయారు చేయడానికి ఆసక్తి ఉన్న వారిని ప్రోత్సహించే విధంగా తగిన చర్యలు చేపడతారు.

తయారుచేసిన ఉత్పత్తుల నాణ్యతను, ప్రమాణాలను తెలుసుకోవడానికి వీలుగా, విభిన్న ప్రయోజనాలు కలిగే విధంగా ఒక టెస్టింగ్‌ ప్రయోగశాల కూడా ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా వర్సిటీలోని ఫార్మా రంగానికి ఉపయుక్తమైన పరిశోధనలు చేయడానికి వీలుగా ప్రయోగశాలలను అభివృద్ధి చేస్తారు.  అమెరికాలోని పర్డ్‌ విశ్వవిద్యాలయం సహకారంతో విద్యార్థులకు అవసరమైన అంతర్జాతీయ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారు.

క్యాట్‌ ఆధారంగా మరో ఎంబీఏ కోర్సు: ఆంధ్ర విశ్వవిద్యాలయం వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరో ఎంబీఏ కోర్సును కూడా నిర్వహించాలని నిర్ణయించింది.  జాతీయ స్థాయిలో మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే క్యాట్‌ పరీక్ష ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసి సీట్లను కేటాయిస్తుంది. 50 శాతం సీట్లు ఇతర రాష్ట్రాల వారికి కేటాయించి 50 శాతం సీట్లను ఏపీ విద్యార్థులకు ఇవ్వనుంది.

విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి కూడా ఆచార్యులను పిలిపించి విద్యాబోధన చేయించాలని భావిస్తోంది. వర్సిటీ ప్రతిష్ట జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వెలుగులీనాలంటే జాతీయస్థాయిలో అత్యంత ప్రతిభావంతులైన వారికి కొన్ని కోర్సులు నిర్వహించడం ముఖ్యమని భావిస్తోంది. దీంతోపాటు మల్టీడిసిప్లీనరీ, ఇంటర్‌ డిసిప్లీనరీ కోర్సులను అందుబాటులోకి తెస్తుంది. దీని కోసం రూ.27కోట్లు వెచ్చించనుంది.
అంతర్జాతీయ ఒప్పందాలు, ఇతర కార్యక్రమాలకు రూ.16 కోట్లు: వర్సిటీలోని ఆచార్యులకు అవసరమైన సదుపాయాలు, శిక్షణ, అభివృద్ధి కార్యక్రమాలను ముమ్మరం చేయనున్నారు. విదేశీ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకోనున్నారు. ఆయా కార్యక్రమాల నిర్వహణకోసం రూ.16 కోట్లు వెచ్చించనున్నారు.

అంతర్జాతీయ స్థాయి వసతులను అభివృద్ధి చేస్తాం
విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి వీలుగా రూసా-2 నిధులను వెచ్చిస్తాం. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో పోటీ పడడానికి వీలుగా అన్ని రకాల మౌలిక వసతులను అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా తీర్చిదిద్దాలని యోచిస్తున్నాం. రూసా-2 పథకాన్ని ప్రధానమంత్రి ప్రారంభించిన నేపథ్యంలో త్వరలో ఆయా నిధులు విడుదల కానున్నాయి. వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తాం.


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo