News

Realestate News

ఆంధ్ర విశ్వవిద్యాలయం కొత్త వెబ్‌సైట్‌ ప్రారంభం

ఆంధ్ర విశ్వవిద్యాలయం కొత్త వెబ్‌సైట్‌ ప్రారంభం
ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే : ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌నుwww.andhrauniversity.edu.in వీసీ ఆచార్య నాగేశ్వరరావు గురువారం ప్రారంభించారు. ఇప్పటి వరకు ఉన్న వెబ్‌సైట్‌లన్నింటినీ అనుసంధానిస్తూ డైనమిక్‌ వెబ్‌సైట్‌ను రూపొందించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని రూపొందించారు. ఈ సందర్భంగా కంప్యూటర్‌ కేంద్రం సంచాలకులు ఆచార్య వెంకటరావును వీసీ నాగేశ్వరరావు అభినందించారు. కేంద్రం సంచాలకులు ఆచార్య నాగేశ్వరరావు మాట్లాడుతూవెబ్‌సైట్‌ను నిరంతరం ఆధునికీకరిస్తామన్నారు. ప్రారంభ కార్యక్రమంలో వర్శిటీ రిజిస్ట్రారు ఆచార్య వి.ఉమామహేశ్వరరావు, పాలకమండలి సభ్యులు ప్రసాదరావు, సురేష్‌, ప్రిన్సిపల్‌ ఆచార్య డి.ఇ.బాబు, ఆచార్య సూర్యప్రకాశరావు, ఆచార్య గౌరీశంకర్‌, ఆచార్య ప్రసాదబాబు తదితరులు పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo