ఆంధ్రపతాకం..విశ్వ వ్యాపితం..
ఆంధ్రపతాకం..విశ్వ వ్యాపితం..
ప్రస్తుతం 22 మంది బాధ్యతల నిర్వహణ

పేరు: ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు
ఉపకులపతి: సెంచూరియన్ విశ్వవిద్యాలయం,
పూర్వ ఉపకులపతి: ఆంధ్రవిశ్వవిద్యాలయం
స్వస్థలం: ఉండి, పశ్చిమగోదావరి జిల్లా
నేపథ్యం: ఈయన ఇక్కడే చదివారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో పీహెచ్డీ చేశారు. ఏయూలోనే ఆచార్యునిగా చేశారు. విశ్వవిద్యాలయానికి 16వ ఉపకులపతిగా చేశారు. అంబేడ్కర్ న్యాయ విశ్వవిద్యాలయానికి ఇన్‌ఛార్జి వీసీగా వ్యవహరించారు. ప్రస్తుతం సెంచూరియన్ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఉన్నారు.
ఈ నీడలోనే…ఆంధ్ర విశ్వవిద్యాలయం అంబేడ్కర్ న్యాయ కళాశాలలో ఆచార్యులుగా చేసిన అయిదుగురు నేడు దేశవ్యాప్తంగా ప్రముఖ విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులుగా ఉన్నారు.
ఇథియోపియాలోనూ…
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏటా వందలాదిమంది విదేశీ విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తుంటారు. వీరిలో ఇథియోపియా దేశస్థులే అధికం. ఇక్కడ చదివిన ఐదుగురు తమ దేశంలో వివిధ విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులుగా ఉన్నారు. ఇథియోపియాలోని జిగ్జిగా విశ్వవిద్యాలయం అధ్యక్షుడిగా డాక్టర్ అబ్దుల్సెమెద్, డెబ్రేటబర్ విశ్వవిద్యాలయం, అసోసా విశ్వవిద్యాలయాల అధ్యక్షుడిగా డాక్టర్ అలెమెయహు కెబెడె, కోటెబి మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయం అధ్యక్షుడిగా డాక్టర్ బిరహనెమెస్కెల్ టెన్నా జ్యువెడై, యూనివర్సిటీ ఆఫ్ గోండర్ ఉపాధ్యక్షుడిగా డాక్టర్ అస్రత్ అట్సెడెవోయ్న్, డెంబిడెలో విశ్వవిద్యాలయం అధ్యక్షుడిగా డాక్టర్ డెలెసా బుల్చా వ్యవహరిస్తున్నారు.
పేరు: ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు
ఉపకులపతి: ఆంధ్రవిశ్వవిద్యాలయం, విశాఖపట్నం
ఇన్‌ఛార్జి ఉపకులపతి: డాక్టర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం
స్వస్థలం: గుంటూరు జిల్లా మాచవరం మండలం గంగిరెడ్డిపాలెం
నేపథ్యం…: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1979-81లో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ అభ్యసించారు. పీహెచ్డీ పూర్తిచేసి చదువుకున్నచోటే 1989లో అధ్యాపకుడిగా చేరారు. ఏయూలో పలు పదవులు నిర్వహించారు. 2016 జులై నుంచి ఏయూ ఉపకులపతిగా సేవలందిస్తున్నారు. 91 వసంతాల చరిత్ర కలిగి, ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులు ఉపకులపతులుగా చేసిన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చిన్నవయసులోనే ఉపకులపతి అయ్యారు.
పేరు: ఆచార్య వి.ఎస్.ఆర్.కె.ప్రసాద్
సంచాలకుడు: ఇండియన్ ఇన్స్టిట్యూటü ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ (ఐఐపిఈ) విశాఖపట్నం, (కేంద్ర విశ్వవిద్యాలయం)
స్వస్థలం: కృష్ణాజిల్లా పామర్రు మండలం, అడ్డాడ.
నేపథ్యం: 1975లో ఏయూలో ఎంటెక్‌లో చేరారు. 1977లో పీహెచ్‌డిలో చేరారు. 1979లో తాను చదువుకున్న కెమికల్ ఇంజినీరింగ్ కళాశాలలోనే అధ్యాపకునిగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి రీడర్‌గా ఆచార్యునిగా ఉన్నతి పొందారు. చీఫ్ వార్డెన్‌గా చేశారు. 2008లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. 2016లో విశాఖకు మంజూరైన ఐఐపీఈ కేంద్ర విశ్వవిద్యాలయానికి తొలుత విద్యా సలహాదారుగా నియమితులయ్యారు. నేడు ఇదే విశ్వవిద్యాలయానికి సంచాలకులయ్యారు.
పేరు: ఆచార్య వలపర్ల వీరయ్య,
ఉపకులపతి: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం, నెల్లూరు
స్వస్థలం: ప్రకాశం జిల్లా జె.పంగలూరు మండలం ముప్పవరం.
నేపథ్యం: 1977లో ఎస్.వి. విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ చేశారు. ఏయూలో 1982లో ఫిజిక్స్‌లో పీహెచ్‌డి చేశారు. ఇక్కడే ఫిజిక్స్ విభాగంలో 1984 లెక్చరర్‌గా 1992 వరకు రీడర్‌గా, 2017 వరకు ఆచార్యునిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏయూ, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాల అకడమిక్ సెన్టüకు సభ్యునిగా వ్యవహరించారు. 2015 నుంచి విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి వీసీగా వ్యవహరిస్తున్నారు.
పేరు: ఆచార్య సుంకరి రామకృష్ణారావు
ఉపకులపతి: కృష్ణా విశ్వవిద్యాలయం, మచిలీపట్నం
స్వస్థలం: కృష్ణాజిల్లా, యలమంచిలి
నేపథ్యం: 1971లో ఆంధ్రవిశ్వవిద్యాలయంలో జువాలజీలో పీజీ చేశారు. 1981 నుంచి ఏయూ పర్యావరణ విభాగంలో ఆచార్యులుగా చేరారు. 2011 వరకు పలు పదవులు నిర్వహించారు. 2016 ఫిబ్రవరిలో కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టారు.
పేరు: భవాని ప్రసాద్ పాండ
ఉపకులపతి: మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ ముంబయి
స్వస్థలం: ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్టణం,
నేపథ్యం: ఏయూ న్యాయ కళాశాలలో 1980-82 మధ్య ఎం.ఎల్. చేశారు. ఎన్బిఎం న్యాయ కళాశాలలో 1989 నుంచి 1994 వరకు ప్రిన్సిపల్‌గా చేశారు. ఒడిశా, మహారాష్ట్ర, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో రీడర్‌గా, సహాయ ఆచార్యునిగా, ఆచార్యునిగా పనిచేశారు. 2014 అక్టోబరు నుంచి మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ ముంబయి ఉపకులపతిగా ఉన్నారు.
పేరు: ఆచార్య ముత్యాలు నాయుడు
ఉపకులపతి: ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం, రాజమహేంద్రవరం
స్వస్థలం: విశాఖ జిల్లా
నేపథ్యం: ఈయన ఏయూలో 1980-82లో ఎంబీఏ చదివారు. ఏయూ సెనెటü సభ్యులుగా చేశారు. సీసెల్ రిజిస్ట్రారుగా చేశారు. 30 ఏళ్లు బోధన చేశారు. ప్రభుత్వ అధీనంలోని మన టీవీ ఈడీగా చేశారు. 2015 డిసెంబరు నుంచి నన్నయ్య విశ్వవిద్యాలయానికి వీసీగా చేస్తున్నారు.
పేరు: ఆచార్య కోనేరు రామకృష్ణారావు
ఛాన్సలర్: గీతం విశ్వవిద్యాలయం
పూర్వ ఉపకులపతి: ఆంధ్ర విశ్వవిద్యాలయం
స్వస్థలం: విజయవాడ, కృష్ణాజిల్లా
నేపథ్యం: 1984 నుంచి 1988 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా చేశారు. ఏపీ స్టేటü ప్లానింగ్ బోర్డు సభ్యునిగా వ్యవహరించారు. ఏయూ సైకాలజీ విభాగంలో అధ్యాపకునిగా చేస్తూ ఫుల్బ్రైటü ఉపకార వేతనంతో అమెరికాకు వెళ్లారు.
పేరు: ఆచార్య ఎస్.సూర్యప్రకాష్
ఉపకులపతి: మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ ఔరంగాబాద్, ఔరంగాబాద్
స్వస్థలం: తెనాలి, గుంటూరు జిల్లా
నేపథ్యం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1984-86 మధ్య ఎం.ఎల్ చదివారు. ఔరంగాబాద్‌లో న్యాయ విశ్వవిద్యాలయానికి వ్యవస్థాపక ఉపకులపతిగా ఉన్నారు. వెట్టిచాకిరి సామాజిక న్యాయం అన్న పుస్తకాన్ని ప్రచురించారు. కోల్‌కత న్యాయ విశ్వవిద్యాలయం, ఎం.ఆర్. కళాశాల, డీఎన్ఆర్ న్యాయ కళాశాలల్లో పనిచేశారు. 2001లో అమెరికన్ న్యాయ వ్యవస్థపై పరిశీలన కోసం వెళ్లిన ప్రపంచ బృందంలో భారతదేశ ప్రతినిధిగా పాల్గొన్నారు.
పేరు : ఆచార్య ఆర్.వెంకట్రావు
ఉపకులపతి: నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా, బెంగళూరు
స్వస్థలం: ఒడిశా, బరంపురం,
నేపథ్యం: నేషనల్ స్కూల్ ఆఫ్ ఇండియా బెంగళూరు విశ్వవిద్యాలయానికి 2009 నుంచి ఉపకులపతిగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 31 సంవత్సరాలు ఫ్యాకల్టీగా చేశారు. న్యాయ కళాశాల ప్రిన్సిపల్‌గా, విద్యార్థి వ్యవహారాల డీన్‌గా, బోర్డు ఆఫ్ స్టడీస్ ఛైర్మన్, న్యాయ విభాగాధిపతిగా, విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులుగా వ్యవహరించారు. ఉత్తమ ఉపకులపతి అవార్డును అందుకున్నారు.
పేరు: ఆచార్య ఎం.ఎస్.ప్రసాదరావు
ఉపకులపతి: గీతం విశ్వవిద్యాలయం, విశాఖపట్టణం
స్వస్థలం: పార్వతీపురం, విజయనగరం జిల్లా
నేపథ్యం: ఆంధ్రవిశ్వవిద్యాలయం రిజిస్ట్రారుగా 2002 నుంచి 2005 వరకు వ్యవహరించారు. 2010లో ద్రవిడ విశ్వవిద్యాలయం విచారణ కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. ఏయూలో ఆచార్యునిగానే కాక పాలనలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2009లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. విద్యాపరంగా పలు అవార్డులు అందుకున్నారు. పలు కమిటీల్లో ప్రాతినిధ్యం వహించారు. ఇండియన్ కెమికల్ సొసైటీ జీవితకాల సభ్యులు.
పేరు : ఆచార్య నీలి బెండపూడి
ప్రో వీసీ: కేన్సాస్ విశ్వవిద్యాలయం, అమెరికా
స్వస్థలం: విశాఖపట్టణం
నేపథ్యం: ఈమె ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పీజీ చేశారు. తల్లిదండ్రులు ఇరువురు ఏయూ ఆంగ్ల భాష విభాగంలో ఆచార్యులుగా చేశారు. అమెరికాలోనే కేన్సాస్ రాష్ట్రంలో ఉన్న కేన్సాస్ విశ్వవిద్యాలయానికి 2016 నుంచి ప్రో వీసీగా వ్యవహరిస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయంలో పలు కీలక పదవులు నిర్వహించారు.
పేరు: ఆచార్య బీలా సత్యనారాయణ
విశ్వవిద్యాలయం: వెల్‌టెక్ డాక్టర్ ఆర్ఆర్ డాక్టర్ ఎస్ఆర్ విశ్వవిద్యాలయం, చెన్నై
స్వస్థలం: కాండ్రంగి, విజయనగరం జిల్లా
నేపథ్యం: 1967లో ఏయూలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో బిఇ, 1975లో ఎం.ఇ. చేశారు. తను చదువుకున్న ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 2008లో ఉపకులపతి అయ్యారు. 2011 వరకు వ్యవహరించారు. ఈయన హయాంలోనే ఏయూ మహిళా ఇంజినీరింగ్ కళాశాల ప్రారంభించారు. 2013 నుంచి చెన్నైలోని వెల్‌టెక్ యూనివర్సిటీకి ఉపకులపతిగా ఉన్నారు. ఈ విశ్వవిద్యాలయం 50 ఏళ్లలోపు విశ్వవిద్యాలయాల్లో దేశంలో మొదటి ర్యాంకును సాధించింది.
పేరు: ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్
ఉపకులపతి: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు
స్వస్థలం: నెల్లూరు
నేపథ్యం: ఏయూ పూర్వ విద్యార్థి. ఇక్కడే పీహెచ్‌డి చేసి ఉత్తమ పరిశోధన అవార్డు అందుకున్నారు. 1985 నుంచి 2016కు ఏయూ అంబేడ్కర్ న్యాయ కళాశాలలో బోధన చేశారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం న్యాయ కళాశాల ప్రిన్సిపల్‌గా చేశారు. యూకే ప్రభుత్వం కామన్వెల్త్ ఫెలోషిప్ అందించింది.
పేరు: ఆచార్య వి.కేశవరావు
ఉపకులపతి: దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం
స్వస్థలం: విశాఖపట్టణం
నేపథ్యం: ఈయన ఏయూలో 1974 నుంచి 1979 వరకు బీఎల్, ఎంఎల్ చదివారు. అనంతరం న్యాయ కళాశాలలో ఆచార్యునిగా, డీన్‌గా ప్రిన్సిపల్‌గా చేశారు. న్యాయ కళాశాల ప్లేస్మెంటü అధికారిగా, అకడమిక్ సెన్టü సభ్యునిగా, పరీక్షల కోఆర్డినేటర్‌గా, వార్డెన్‌గా, చీఫ్ వార్డెన్‌గా చేశారు. ఉత్తమ పరిశోధక అవార్డులు, విద్యా పరంగా పలు అవార్డులు అందుకున్నారు. పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సులు నిర్వహించారు.

ఉపకులపతి: చాణక్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, పట్నా
స్వస్థలం: విజయనగరం
నేపథ్యం: ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల విభాగాధిపతిగా, డీన్‌గా, ప్రిన్సిపల్‌గా వ్యవహరించారు. విశాఖలోని దామోదరం సంజీవయ్య న్యాయ కళాశాల వ్యవస్థాపక ఛాన్సలర్. నల్సార్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రారుగా చేశారు. చాణక్య జాతీయ విశ్వవిద్యాలయం పాట్నాకు 12 ఏళ్లుగా ఉపకులపతిగా వ్యవహరిస్తున్నారు. ఆచార్య లక్ష్మీనాధ్ 12 ఏళ్లుగా నిర్విఘ్నంగా కొనసాగడం కోసం విశ్వవిద్యాలయ చట్టాల్లో మార్పులు చేశారు.
పేరు: ఆచార్య పులపా సుబ్బారావు
విశ్వవిద్యాలయం: ఓరియంటల్ విశ్వవిద్యాలయం, ఇండోర్, మధ్యప్రదేశ్
స్వస్థలం: వంగలపూడి, సీతానగరం మండలం, తూర్పుగోదావరి జిల్లా
నేపథ్యం: 1974 నుంచి 76 వరకు ఏయూలో ఎంకాం చదివారు. 1979 నుంచి 82 వరకు పీహెచ్‌డి చేశారు. శ్రీసత్యసాయి విశ్వవిద్యాలయంలో పనిచేశారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతిగా వ్యవహరించారు. న్యూ గయాన దేశంలోని యూనివర్సిటీ ఆఫ్ పపువా ప్రో ఛాన్సలర్‌గా చేశారు. 40 ఏళ్ల బోధనా రంగంలో 16 ఏళ్లు విదేశాల్లోను 24 ఏళ్లు వివిధ రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లో విద్యనందించారు. పలు అవార్డులు అందుకున్నారు.