ఆంగ్ల విద్య అభివృద్ధికి ఒప్పందం
ఆంగ్ల విద్య అభివృద్ధికి ఒప్పందం

ఆంగ్ల విద్య అభివృద్ధికి ఒప్పందం
ఒప్పంద పత్రాలు మార్చుకుంటూ…
విద్యా సంస్థల్లో ఆంగ్ల విద్యను పటిష్ట పరిచేందుకు చర్యలు చేపడుతున్నట్లు అమెరికా రాయబారి (హైదరాబాద్) డాక్టర్ మోనికా సెటియా తెలిపారు.
బీచ్‌రోడ్డు జీవీపీ ఎం.ఎల్.బి.టి పాఠశాలలో బుధవారం ఆమె పర్యటించారు.
అమెరికా – ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా గాయిత్రీ విద్యా పరిషత్ ప్రతినిధులతో ఒప్పందం చేసుకున్నారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ దేశంలో 25 పాఠశాలలు ఎంపిక చేసినట్లు చెప్పారు. మొదటి దశలో జీవీపీ ఎం.ఎల్.బి.టి స్కూల్లో ఆంగ్ల విద్యాబోధన అమలు చేస్తున్నట్లు చెప్పారు.
బ్రయిట్ ఫ్యూచర్ పేరుతో చేపట్టిన విద్యా విధానం అమెరికాలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఇక్కడి విద్యార్థులకు ఆంగ్ల బోధన చేస్తారన్నారు.
ఆచార్య సోమరాజు, ఆచార్య దక్షిణామూర్తి, పాఠశాల హెచ్.ఎం కె.మధురవాణి, సిబ్బంది పాల్గొన్నారు.