ఆంగ్లభాషాభివృద్ధిపై సదస్సులు

విజయనగరం అర్బన్, న్యూస్టుడే: రాష్ట్ర విద్యపరిశోధన ఆదేశాల మేరకు ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల భాషాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈనెల 11 నుంచి 20తేదీ వరకు పదిరోజుల పాటు సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లావిద్యాశాఖాధికారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత కల ఉపాధ్యాయులు వివరాలు జిల్లావిద్యాశాఖ కార్యాలయానికి అందజేయాలని పేర్కొన్నారు. జిల్లాలో పూర్వం 30రోజులు బెంగళూరులో ఈఎల్టీ శిక్షణలో పాల్గొని, ఏ+, ఏగ్రేడ్ పొందిన ఉపాధ్యాయులు రెండు రోజుల్లోగా సంబంధిత మండల విద్యాశాఖాధికారుల ద్వారా అందజేయాలన్నారు.