News

Realestate News

అవకాశాల్ని చేజార్చుకున్న టీమ్‌ఇండియా

రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన బ్యాట్స్‌మెన్‌

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్‌ఇండియా వచ్చిన అవకాశాల్ని చేజార్చుకుంది. ఆదివారం తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టును 235 పరుగులకే కట్టడి చేసినా రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ మరోసారి తడబడ్డారు. కివీస్‌ బౌలర్లు విజృంభించడంతో టాప్‌ ఆర్డర్‌ మొత్తం ఘోరంగా విఫలమైంది.

దీంతో రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్‌ 36 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 90పరుగులే చేసింది. ప్రస్తుతం హనుమ విహారి(5), రిషభ్‌ పంత్‌(1) క్రీజులో ఉన్నారు. టీమ్‌ఇండియా 97 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక సోమవారం వీరిద్దరు ఎలా ఆడతారనేదానిపై ఆసక్తి పెరిగింది.

అంతకుముందు 63/0తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన న్యూజిలాండ్‌ 235 పరుగులకు ఆలౌటైంది. మహ్మద్‌ షమి(4), జస్ప్రీత్‌ బుమ్రా(3), జడేజా(2) చెలరగేడంతో ఆ జట్టు భారత్‌ కన్నా ఏడు పరుగులు తక్కువ చేసింది.

ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌(52; 122 బంతుల్లో 5×4) అర్ధశతకం బాదగా.. చివర్లో కైల్‌ జేమిసన్‌(49; 63 బంతుల్లో 7×4)మరోసారి రాణించాడు. 177 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ను.. జేమిసన్‌, నీల్‌ వాగ్నర్‌(21) ఆదుకున్నారు.

చివరి రెండు వికెట్లను తీయడంలో భారత బౌలర్లు మరోసారి విఫలమవడంతో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని కోల్పోయి తొలి అవకాశాన్ని చేజార్చుకున్నారు. తొమ్మిదో వికెట్‌కు జేమిసన్‌, వాగ్నర్‌ 51 పరుగుల భాగస్వామ్యం జోడించి టీమ్‌ఇండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. దీంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 7 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది.

తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన టీమ్‌ఇండియా ఆదినుంచీ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. కివీస్‌ బౌలర్లు మరోసారి విజృంభించారు. ఏ దశలోనూ టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌కు అవకాశం ఇవ్వలేదు.

వచ్చిన బ్యాట్స్‌మన్‌ను వచ్చినట్లు పెవిలియన్‌ పంపారు.

ట్రెంట్‌బౌల్ట్‌ 3 వికెట్లతో చెలరేగగా.. సౌథీ, గ్రాండ్‌హోమ్‌, వాగ్నర్‌ చెరో వికెట్‌తో మెరిశారు. దీంతో రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి భారత్‌ ఆరు వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. పృథ్వీషా(14), మయాంక్‌ అగర్వాల్‌(3), విరాట్‌ కోహ్లీ(14), ఛెతేశ్వర్‌ పుజారా(24), అజింక్య రహానె(9), ఉమేశ్‌ యాదవ్‌(1) పెవిలియన్‌కు క్యూ కట్టారు.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo