అరకులోయకు పోటెత్తిన పర్యటకులు
అరకులోయకు పోటెత్తిన పర్యటకులు

ఆదివారం అరకులోయలోని గిరిజన మ్యూజియాన్ని 1700 మంది సందర్శించారు. పర్యటకుల కోసం మ్యూజియం నిర్వాహకులు ఆదివారం ప్రత్యేకంగా గిరిజన సంప్రదాయ నృత్యం థింసాను ప్రదర్శించారు. మూడు షోలతో సందర్శకులను రంజింపజేశారు. సందర్శకుల తాకిడితో లాడ్జిలు, అతిథిగృహాలు పూర్తిగా నిండిపోయాయి. వ్యూపాయింటü, కాఫీ తోటలు, పద్మాపురం ఉద్యానవనం, చాపరాయి జలపాతాలు కోలాహలంగా మారాయి.