అరకును మరింతగా అభివృద్ధి చేయాలి

హైకోర్టు న్యాయమూర్తి శ్యామ్‌ప్రసాద్
అరకులోయ:
ఆంధ్రా వూటీ అరకులోయను మరింతగా అభివృద్ధి చేయాల్సి ఉందని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి శ్యామ్‌ప్రసాద్ అన్నారు. మంగళవారం అరకులోయలో కుటుంబ సమేతంగా పర్యటించారు. అరకు అందాలు చాలా బాగున్నాయన్నారు. అరకులోయ పరిసర ప్రాంతాలను మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశ, విదేశాల నుంచి పర్యటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నందున వారిని ఆకట్టుకునేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. పర్యటకంగా అభివృద్ధి జరిగితే స్థానికులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించే అవకాశం ఉందన్నారు. అనంతరం పద్మాపురం ఉద్యాన వనాన్ని, చాపరాయి జలపాతాన్ని సందర్శించారు. గిరిజన మ్యూజియాన్ని సందర్శించిన అనంతరం కాఫీహౌస్‌ను పరిశీలించారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అప్పారావు, ఎస్సై సింహాచలం వారి వెంట ఉన్నారు.