News

Realestate News

అయిదు వేల మందితో ధర్మ పోరాట దీక్ష : మంత్రి గంటా

అయిదు వేల మందితో ధర్మ పోరాట దీక్ష : మంత్రి గంటా
విశాఖపట్నం, న్యూస్‌టుడే : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 20న చేపట్టనున్న ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా తగరపువలసలో అయిదు వేల మందితో ఒక్క రోజు నిరాహార దీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. స్థానిక జడ్పీ అతిథి గృహంలో గురువారం నిర్వహించిన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి విభజన చట్టంలో పొందు పరిచిన హామీలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సీఎం ఒక్క రోజు నిరాహార దీక్ష చేపడుతున్నారన్నారని మంత్రి వివరించారు. ముఖ్యమంత్రికి మద్దతుగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ ధర్మపోరాట దీక్షలు శుక్రవారం నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తరగపువలస బంతాట మైదానం లేదా పెట్రోల్‌ బంకు వద్ద ఈ దీక్ష నిర్వహించాలని నిశ్చయించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి తన పుట్టిన రోజున చేపడుతున్న ఈ దీక్షకు ప్రజలంతా స్వచ్ఛందంగా తరలి వచ్చి మద్దతు తెలపాలని మంత్రి గంటా కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్‌ కోరాడ నాగభూషణరావు, భీమిలి మాజీ ఎమ్పీపీ గాడు వెంకటప్పడు, జిల్లా తెలుగు మహిళా రూరల్‌ అధ్యక్షురాలు కె.లీలావతి, భీమిలి, పద్మనాభం జెడ్పీటీసీ సభ్యులు ఎస్‌.అప్పారావు, కె.దామోదరరావు ఇతర నాయకులు కోరాడ రాజబాబు, కొప్పల ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo