News

Realestate News

అమ్మవారికి వెండి కిరీటం

అమ్మవారికి వెండి కిరీటం

పాతపట్నం, న్యూస్‌టుడే(Silver crown to Amma): ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీనీలమణిదుర్గ అమ్మవారి విగ్రహానికి వెండి కిరీటం ఒక భక్తుడు అందించారు. శ్రీకాకుళానికి చెందిన భక్తుడు అమ్మవారికి 1.70 కేజీల బరువు కలిగిన వెండి కిరీటాన్ని తయారు చేయించి అందించినట్లు ఆలయ కమిటీ ఛైర్మెన్‌ ఎ.సన్యాసిరావు తెలిపారు. మహిమ కలిగిన అమ్మవారికి భక్తులు విలువైన కానుకలు అందిస్తున్నారని ఆయన తెలిపారు.