అబ్బురపరిచిన కవాతు

అబ్బురపరిచిన కవాతు
ఘనంగా హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం
ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే: విశాఖ సిటి ఎ.ఆర్.మైదానంలో మంగళవారం ఉదయం హోంగార్డుల 54వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సంయుక్త పోలీసు కమిషనర్ ఎ.సత్తార్‌ఖాన్ ముఖ్యఅతిథిగా పాల్గొని వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. హోమ్‌గార్డులు కవాతును అద్భుతంగా ప్రదర్శించారు. అన్ని ప్లటూన్(విభాగాలను) ఆయన పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏడీసీపీ మహేంద్రపాత్రుడు, హోంగార్డుల ఆర్.ఐ.రమణమూర్తి, సుమారు 800కు పైగా నగర హోమ్‌గార్డులు పాల్గొన్నారు.