News

Realestate News

అబ్బురపరచిన అగ్నిమాపక విన్యాసాలు

అబ్బురపరచిన అగ్నిమాపక విన్యాసాలు
పరవాడ గృహనిర్మాణ కాలనీకి తాగునీరు ఇవ్వండి
జీవీఎంసీ అధికారులకు కలెక్టర్‌ ఆదేశం
వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: పరవాడ వద్ద ఏర్పాటు చేసిన గృహనిర్మాణ సముదాయానికి తక్షణమే తాగునీటిని అందించాలని కలెక్టర్‌ యువరాజ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం తన ఛాంబరులో గృహనిర్మాణం, జీవీఎంసీ, గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులతో సమావేశమై నీటి సరఫరా స్థితిపై సమీక్షించారు. 1838 ఇళ్లతో భారీ గృహనిర్మాణ కాలనీని ఇక్కడ నిర్మించారు. పదివేలమంది నివసిస్తున్నారు. విద్యుత్తు సరఫరాలో ఇబ్బందులు లేవని, తాగునీటి సరఫరా తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామీణ నీటిసరఫరా పథకం కింద నీరు ఇవ్వడానికి కొంత సమయం పడుతుందని ఆ శాఖ అధికారులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్‌ జీవీఎంసీ పరిధిలో ఉన్న దేశపాత్రునిపాలెం నుంచి నీటి సరఫరా చేపట్టాలని ఆదేశించారు. గృహనిర్మాణ శాఖ వద్ద ఉన్న రూ. 75 లక్షలను జీవీఎంసీ ఖాతాకు బదలాయించాలని, తదుపరి పైపులైన్ల ద్వారా నీటి సరఫరా చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. త్వరలో కాలనీ ప్రారంభోత్సవం ఉంటుందని చెప్పారు. వుడా అటవీశాఖ అధికారి వద్దకు వెళ్లి అవసరమైన మొక్కలు తీసుకోవాలని సూచించారు. సమీక్షలో గృహనిర్మాణ శాఖ పీడీ జి.వి.ప్రసాదు, జీవీఎంసీ ఎస్‌.ఇ. ఎం.వెంకటేశ్వరరావు, ఆర్‌.డబ్లు్య.ఎస్‌. ఈ.ఈ మెహర్‌ప్రసాద్‌, గృహనిర్మాణ శాఖ ఈఈ రవిశంకర్‌, డీఈఈ బి.వి.వి.ప్రసాద్‌ పాల్గొన్నారు.

Source By: http://www.eenadu.net/


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo