News

Realestate News

అప్పన్న స్వామికి విశేష పూజలు

అప్పన్న స్వామికి విశేష పూజలు
సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహ లక్ష్మీ నృసింహ స్వామికి ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. స్వామికి వేకువ జామున సుప్రభాతసేవ, ఆరాధనలు జరిగాయి. అనంతరం స్వామి ఉత్సవ మూర్తుల్ని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆస్థాన మండపంలో అధిష్ఠింపజేశారు. ఉభయ దేవేరులతో సమేతుడైన స్వామికి ఆస్థాన మండపంలో నిత్య కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. కల్యాణకర్తలకు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. దూర ప్రాంతాల నుంచి విచ్చేసిన వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo