News

Realestate News

అనకాపల్లి నియోజకవర్గానికి రూ.10కోట్లు

vizag news 2106

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల
తాళ్లపాలెం (కశింకోట), న్యూస్‌టుడే: అనకాపల్లి నియోజకవర్గానికి రూ. 10 కోట్ల ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర గిరిజన, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు ప్రకటించారు. ఈ నిధుల్లో రూ.5 లక్షలతో అవసరమైనచోట అంబేడ్కర్‌ భవన సముదాయాన్ని నిర్మించాలని సూచించారు. మండలంలో తాళ్లపాలెం ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణలో రూ.6.28 కోట్ల వ్యయంతో నిర్మించిన వసతిగృహ సముదాయాన్ని ఆదివారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన బహిరంగ సమావేశంలో మంత్రి రావెల ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సభకు ముందు మంత్రి అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలో అంబేడ్కర్‌ స్టడీసెంటర్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భవిష్యత్‌లో పలు ఆదర్శ ఆశ్రమ పాఠశాలల్లో రూ.25కోట్ల నాబార్డు నిధులతో భవన సముదాయాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. తాళ్లపాలెం గురుకుల పాఠశాలలో రూ. కోటితో మినీ ఆడిటోరియం నిర్మించనున్నట్లు ప్రకటించారు. పాఠశాల అభివృద్ధి పనులకు మరో రూ.కోటి మంజూరు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ, మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో తాళ్లపాలెం, కూండ్రంలో జూనియర్‌ కళాశాలల ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విద్యారంగానికే అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహిస్తున్నారన్నారు. ఆడపిల్లల విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తూ రూ. 90 కోట్లతో సైకిళ్లు ముఖ్యమంత్రి ఇస్తున్నారన్నారు. పార్లమెంట్‌ సభ్యుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులంతా ఏకాగ్రతతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. సభాధ్యక్షులు ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతిభా అవార్డులు ప్రకటించిన ఘనత మంత్రి గంటా శ్రీనివాసరావుకే దక్కిందన్నారు. అనంతరం బాలికలు చేసిన సాంస్కృతిక ప్రదర్శన అలరించింది. జడ్పీటీసీ సభ్యుడు మలసాల ధనమ్మ, సర్పంచి చెవ్వేటి గోవిందమ్మ, డెయిరీ డైరెక్టరు మలసాల రమణరావు, డీసీసీబీ డైరెక్టరు సిదిరెడ్డిశ్రీనివాసరావు, తెదేపా నాయకుడు లాలం భాస్కరరావు, ఉపసర్పంచి అద్దంకి సతీష్‌, మలసాల కుమారరాజా, నిమ్మదల త్రినాథరావు, ఉగ్గిన రమణమూర్తి, ఆర్డీవో పద్మావతి, తహసీల్దారు ఎం.ఎ.మనోరంజని, ఎంపీడీవో బి.వి.సత్యనారాయణ, సాంఘిక సంక్షేమశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మామిడివాక గెడ్డను పరిశీలించిన మంత్రులు: కార్యక్రమం అనంతరం నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా తాళ్లపాలెం మామిడివాక గెడ్డలో రూ. 50 లక్షల వ్యయంతో చేపట్టిన పూడికతీత, గట్టు పటిష్ఠ పనులను రాష్ట్రమంత్రులు రావెల కిశోర్‌బాబు, గంటా శ్రీనివాసరావు, ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ పనులను ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ స్వయంగా చూపించారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo