అనకాపల్లి-అచ్యుతాపురం రహదారి సర్వే వేగవంతం
అనకాపల్లి-అచ్యుతాపురం రహదారి సర్వే వేగవంతం
అనకాపల్లి పట్టణం, న్యూస్టుడే: అనకాపల్లి-అచ్యుతాపురం రహదారి విస్తరణ పనుల ఎంజాయ్మెంట్ సర్వే పనులను వేగవంతం చేయాలని ఆర్డీవో బి.పద్మావతి సర్వేయర్లను ఆదేశించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ అచ్యుతాపురం రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు భూములపై గతంలో సర్వే జరిగిందన్నారు.
అయితే దీనిపై ఎంజాయ్మెంట్ సర్వేలో భాగంగా అనకాపల్లి రెవెన్యూ డివిజన్లోని 12 మండలాలకు చెందిన సర్వేయర్లను విధుల్లో పెడుతున్నామన్నారు. ఆర్అండ్బీ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే జరిపి ప్రభుత్వ, ప్రైవేటు భూములపై వివరాల సమగ్రంగా రూపొందిస్తారన్నారు. విస్తరణలో పోయే భూముల్లో ఎవరు ఉన్నారు.. అవి ఎవరిపేరు మీద ఉన్నాయన్నదానిపై సమగ్రంగా సర్వే జరుపుతున్నట్లు వివరించారు. వారం రోజుల్లోగా ఎంజాయ్మెంట్ సర్వేను పూర్తిచేయాలని సర్వేయర్లకు ఆర్డీవో సూచించారు.