News

Realestate News

అత్యవసర అవస్థలు


అత్యవసర అవస్థలు

 

రెండు నెలలుగా 108 సిబ్బందికి అందని వేతనాలు 
చాలాచోట్ల సేవలకు విఘాతం

ఈనాడు, వరంగల్‌:  అత్యవసర అవస్థలు

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 320 వరకు 108 వాహనాలు ప్రజలకు అత్యవసర సేవలందిస్తున్నాయి.

మొత్తంగా 2000 సిబ్బంది పనిచేస్తున్నారు.

రెండు నెలలుగా సిబ్బందికి వేతనాలు అందడం లేదు.

అయినా అత్యవసర సేవలు కావడంతో వారు విధులకు హాజరవుతున్నారు.

వేతనాలతోపాటు వాహనాల డీజిల్‌ బిల్లులు, మరమ్మతులకు కూడా నిధులు విడుదల కావడం లేదు.

రూ.9 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉందని చెబుతున్నారు.

ఇందులో డీజిల్‌, వాహనాల మరమ్మతుల కోసమే రూ.4 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది.

గత రెండు రోజులుగా డీజిల్‌ లేక సుమారు 100 వరకు వాహనాలు నిలిచిపోయాయి.

ప్రస్తుతం నిల్వ ఉన్న ఇంధనంతో నడుస్తున్న వాహనాలు నేడో, రేపో నిలిచిపోయే పరిస్థితి తలెత్తింది.

ఆదివారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో కాటారం-మహాముత్తారం మార్గంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళకు అత్యవసర చికిత్స

అందించాల్సి ఉన్నా..

108 వాహనం రాకపోవడంతో సకాలంలో వైద్యం అందక ఆమె మృత్యువాతపడింది.

రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు,

ఇతరత్రా అత్యవసర వైద్యంకోసం బాధితులు అవస్థలు ఎదుర్కొన్నారు.